ఐపీఆర్‌‌లో సైంటిఫిక్‌ అసిస్టెంట్‌-బి పోస్టులు..

by Vinod kumar |
ఐపీఆర్‌‌లో సైంటిఫిక్‌ అసిస్టెంట్‌-బి పోస్టులు..
X

దిశ, కెరీర్: గాంధీనగర్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రిసెర్చ్(ఐపీఆర్) డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన సైంటిఫిక్ అసిస్టెంట్-బి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 15 పోస్టులను భర్తీ చేయనున్నారు. కనీసం 60% మార్కులతో సంబంధిత విభాగంలో డిప్లొమా/ బీఎస్సీ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు అక్టోబరు 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

విభాగాలు: సివిల్‌, ఎలక్ట్రానిక్స్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, కంప్యూటర్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌.

అర్హత: కనీసం 60% మార్కులతో సంబంధిత విభాగంలో డిప్లొమా/ బీఎస్సీ.

వయసు: 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక: స్క్రీనింగ్‌ టెస్ట్‌/ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ. 200 ఎస్సీ/ ఎస్టీ/ మహిళలు/ దివ్యాంగులు/ ఈడబ్ల్యూఎస్‌/ ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తుకు చివరి తేదీ: 13/10/2023.

వెబ్‌సైట్: https://www.ipr.res.in/

Next Story