గుడ్ న్యూస్.. కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల

by Dishanational4 |
గుడ్ న్యూస్.. కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల
X

దిశ, కెరీర్: సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, కానిస్టేబుల్ (డ్రైవర్), కానిస్టేబుల్స్ (డ్రైవర్-కమ్-పంప్-ఆపరేటర్-ఫైర్ సర్వీస్) ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ ఫిబ్రవరి 22.

పోస్టుల వివరాలు:

1. కానిస్టేబుల్ /డ్రైవర్ - 183 (యూఆర్ - 76, ఎస్సీ - 27, ఎస్టీ - 13, ఓబీసీ-49, ఈడబ్ల్యూఎస్ -18)

2. కానిస్టేబుల్ /డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ (ఫైర్ సర్వీస్): 268 ( యూఆర్ -111, ఎస్సీ - 40, ఎస్టీ - 19, ఓబీసీ - 72, ఈడబ్ల్యూఎస్ - 26)

మొత్తం ఖాళీలు: 451

అర్హత: మెట్రిక్యులేషన్ లేదా సమాన అర్హతలు ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ (హెవీ మోటార్ వెహికల్ లేదా టాన్స్ పోర్ట్ వెహికల్: లైట్ మోటార్ వెహికల్, మోటార్ సైకిల్ విత్ గేర్)తో పాటు మూడేళ్ల డ్రైవింగ్ అనుభవం ఉండాలి.

శారీరక ప్రమాణాలు: ఎత్తు 167 సెం.మీ., ఛాతీ కొలత 80 -85 సెం.మీ ఉండాలి.

వయసు: 21 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.

వేతనం: నెలకు రూ. 21,700 నుంచి రూ. 69,100 ఉంటుంది.

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా చేయాలి.

ఎంపిక: ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, డాక్యుమెంటేషన్, ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

చివరి తేదీ: ఫిబ్రవరి 22, 2023.

వెబ్‌సైట్: https://cisfrectt.in


Next Story

Most Viewed