- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- ఆరోగ్యం
- ఫోటోలు
- Job Notifications
- OTT Release
- భక్తి
గ్రూప్ -2 పరీక్ష విధానంలో మార్పులు

దిశ, కెరీర్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రూప్–2 పోస్టులకు నిర్వహించే పరీక్ష విధానంలో మార్పులు చేసింది. ఇప్పటివరకు గ్రూప్–2 మెయిన్స్‌ను మూడు పేపర్లలో నిర్వహిస్తుండగా వాటిని 2 పేపర్లకు కుదించింది. ఈ మేరకు ఇటీవల జీవో 6ను విడుదల చేసింది. పరీక్ష విధానం, సిలబస్‌పై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. వీటిని ఆమోదిస్తూ ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేసింది.
గ్రూప్–2 పరీక్ష, సిలబస్ మార్పులు ఇవే:
స్క్రీనింగ్ టెస్ట్:
జనరల్ స్టడీస్ – మెంటల్ ఎబిలిటీ : 150 మార్కులు
మెయిన్ పరీక్షలో రెండు పేపర్లు:
పేపర్–1: (150మార్కులు)
1. సోషల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఏపీ సామాజిక చరిత్ర, సాంస్కృతోద్యమాలు)
2. జనరల్ ఓవర్ వ్యూ ఆఫ్ ద ఇండియన్ కాన్‌స్టిట్యూషన్
పేపర్–2: (150మార్కులు)
1. ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ
2. సైన్స్ అండ్ టెక్నాలజీ