పకడ్బందీగా నర్సింగ్ రిక్రూట్​మెంట్.. మరికొన్ని గంటల్లో అప్లికేషన్లు షురూ

by Disha Web Desk |
పకడ్బందీగా నర్సింగ్ రిక్రూట్​మెంట్.. మరికొన్ని గంటల్లో అప్లికేషన్లు షురూ
X

దిశ, తెలంగాణ బ్యూరో : వైద్యారోగ్యశాఖలో స్టాఫ్​నర్సు పోస్టుల భర్తీకి బుధవారం నుంచి అప్లికేషన్ ప్రాసెస్​ప్రారంభం కానున్నది. అన్ని ప్రభుత్వాసుపత్రులలో 5,204 పోస్టులను నింపనున్నారు. జనవరి 25 నుంచి ఫిబ్రవరి 15 వరకు ఆన్​లైన్‌లో దరఖాస్తులు తీసుకోనున్నారు.జీఎన్​ఎం,బీఎస్సీ నర్సింగ్​కోర్సులు పూర్తి చేసినోళ్లు అర్హులుగా నోటిఫికేషన్​లో ఇచ్చారు. వయోపరిమితిని 18–44 ఏళ్లుగా ఫిక్స్​చేశారు.ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఐదేళ్లు సడలింపు ఉన్నది. దివ్యాంగులకు పదేళ్లు ఇచ్చారు.అయితే ఈ రిక్రూట్​మెంట్ ను మెడికల్​ బోర్డు చాలా జాగ్రత్తగా చేయనున్నది.ఎక్కడా సమస్యలు లేకుండా పకడ్భందీగా ప్రణాళికలు చేస్తున్నామని బోర్డు అధికారులు తెలిపారు.గతంలో 2017 నోటిఫికేషన్​లో టీఎస్​పీఎస్సీ ద్వారా జరిగిన నియామకాల్లో అనేక సమస్యలు నర్సులు ఎదుర్కోవాల్సి వచ్చింది.

Next Story