ఐటీ సంస్థ క్యాప్ జెమిని కూల్ నిర్ణయం!

by  |
ఐటీ సంస్థ క్యాప్ జెమిని కూల్ నిర్ణయం!
X

కొవిడ్-19 వల్ల అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న కార్పొరెట్ సంస్థలు..ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలకు వేటు, వేతనాల్లో కోత ఇవ్వక తప్పదనే అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలోనే ప్రముఖ్య ఐటీ సంస్థ క్యాప్ జెమిని సంక్షోభం ఉన్నా సరే ఈ సంవత్సరం ఉద్యోగ నియామకాలు కొనసాగించి తీరుతామని స్పష్టం చేసింది. క్యాపస్ ద్వారా దాదాపు 8,000 మందిని ఉద్యోగాల్లోకి తీసుకుంటామని బుధవారం ప్రకటించింది. పలు క్యాంపస్‌ల నుంచి 8 వేల కంటే ఎక్కువ ఎల్‌వోఐలు ఉన్నాయని, ఇంజనీరింగ్ పరీక్షలు ముగిసిన తర్వాత నియామకాలు ప్రారంభమవుతాయని సంస్థ వెల్లడించింది. సంస్థ ప్లాన్‌లు, క్లయింట్ల అవసరాలకు అనుగుణంగా నియామకాలు చేపడతామని క్యాప్ జెమిని ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ అశ్విన్ చెప్పారు.

డిజిటల్, డేటా అనలిటిక్స్, క్లౌడ్ వంటి సరికొత్త సాంకేతికతపై దేష్టి పెట్టి కొత్త ఉద్యోగులతో పాటు సీనియర్లకు కూడా అవకాశమిస్తామని ఆయన స్పష్టం చేశారు. కరోనా సంక్షోభం వల్ల పరీక్షలు ఆలస్యమైనప్పటికీ ఈ ఏడాది కాలేజ్ డిగ్రీ అందుకున్న వారికిచ్చే అన్ని క్యాంపస్ ఆఫర్లన్ను గౌరవిస్తామని, భవిష్యత్తులో కూడా ఇదే ధోరణి కొనసాగుతుందని వివరించారు. అంతేకాకుండా, ప్రస్తుతం కంపెనీలో పది నుంచి పదిహేనేళ్ల అనుభవమున్న వారికి ప్రత్యేకమైన శిక్షణ ఇస్తామని, వారికి ప్రాజెక్ట్ మేనేజర్లుగా, ఆర్టిటెక్టులుగా నియమిస్తామని వెల్లడించారు. అంతర్జాతీయంగా క్యాప్ జెమిని సంస్థలో మొత్తం 2,70,000 మంది ఉద్యోగులుండగా, వీరిలో 1,25,000 మంది భారతీయులే కావడం విశేషం.

Tags: Capgemini, hiring, covid-19, covid-19 outbreak, coronavirus



Next Story

Most Viewed