ప్రచారంలో కొవిడ్ నిబంధనలు పాటించాలి: ఎస్ఈసీ

52

దిశ, తెలంగాణ బ్యూరో: జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా ఇంటింటి ప్రచారం, రోడ్‌షోలు, ర్యాలీల్లో.. అభ్యర్ధులు, కార్యకర్తలు కొవిడ్ నిబంధనలు పాటించాల్సిందేనని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది. కొన్ని పార్టీలు ఎన్నికల సంఘం జారీ చేసిన కొవిడ్‌ నిబంధనలు పాటించడం లేదని, ఎట్టి పరిస్థితుల్లోనూ నిబంధనలు ఉల్లంఘించరాదని హెచ్చరించింది. అన్నిపార్టీల అభ్యర్ధులు, కార్యకర్తలు ఎన్నికల ప్రచారం సందర్భంగా తప్పని సరిగా ముఖానికి మాస్క్‌ ధరించాలని, అలాగే శానిటైజర్లను వినియోగిస్తూ భౌతిక దూరం పాటించాలని, ఇంటింటి ప్రచారానికి వెళ్లినప్పుడు అభ్యర్ధితో పాటు ఐదుగురు మాత్రమే వెళ్లాలని, ఇతరులు ప్రచారంలో పాల్గొంటే తప్పని సరిగా ఫేస్‌మాస్క్‌ ధరించాలని సూచించింది.