ప్రయాణికులు లేక రైళ్లు రద్దు

by  |
Trains canceled,
X

దిశ,తెలంగాణ బ్యూరో : దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని కొన్ని రూట్ లలో ప్రయాణికులు కరువవడంతో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కొద్ది రోజుల పాటు రైళ్లను రద్దు చేసేందుకు చర్యలు తీసుకుంది. ఈ సందర్భంగా సోమవారం రద్దు చేసిన రైళ్ల వివరాలను ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో నడిచే కొన్ని రైళ్లు జూన్ 1 వరకూ రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. రద్దు చేసిన రైళ్లలో సికింద్రాబాద్ -కర్నూల్ ఎక్స్‌ప్రెస్ సర్వీసును ఏప్రిల్ 28 నుంచి మే 31 వరకు, కర్నూలు-సికింద్రాబాద్ రైలును ఏప్రిల్ 29 నుంచి జూన్ 1 వరకూ రద్దు చేసినట్లు తెలిపింది.

మైసూరు- రేణిగుంట ఎక్స్‌ప్రెస్ సర్వీసును ఏప్రిల్ 30 నుంచి మే 28 వరకు, రేణిగుంట- మైసూరు ఎక్స్‌ప్రెస్ రైలును మే 1 నుంచి మే 29 వరకు, సికింద్రాబాద్- ముంబయి ఎల్‌టీటీ సర్వీసును ఏప్రిల్ 30 నుంచి మే 28 వరకు నిలిపివేసినట్లు దక్షిణ మధ్య రైల్వే స్పష్టం చేసింది. వీటితో పాటు నర్సాపూర్ – నిడదవోలు, నిడదవోలు – నర్సాపూర్ , సికింద్రాబాద్ – బీదర్, బీదర్- హైదరాబాద్ రైళ్లు 28 ఏప్రిల్ నుంచి మే 31 వరకు రద్దు చేసినట్లు తెలపారు.

Next Story

Most Viewed