ఏపీలో పదో తరగతి పరీక్షలు రద్దు

by  |
ఏపీలో పదో తరగతి పరీక్షలు రద్దు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విద్యార్థులందరినీ పై తగరతులకు ప్రమోట్ చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ శనివారం మీడియా సమావేశంలో ప్రకటించారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని మంత్రి సురేశ్ వెల్లడించారు. దీంతో 6.3లక్షల మంది విద్యార్థులు పాస్ కానున్నారని, ఏడాదిలో కనబరిచిన ప్రతిభ ఆధారంగా విద్యార్థులకు గ్రేడింగ్ విధానం ఉంటుందన్నారు. అటు ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను కూడా రద్దు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఇంటర్ రెండేళ్లలో ఫెయిల్ అయిన విద్యార్థులను కూడా పాస్ కిందే పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. సప్లిమెంటరీ పరీక్షల కోసం చెల్లించిన ఫీజును వాపస్ ఇస్తామని మంత్రి తెలిపారు.

Next Story