పేడపురుగుల మీద రోబో కెమెరా..ఎందుకంటే?

by  |
పేడపురుగుల మీద రోబో కెమెరా..ఎందుకంటే?
X

మన కంటితో ప్రపంచాన్ని చూడటం దాదాపు అందరికీ ఒకేలాగ ఉంటుంది. అలాగే జంతువులు ప్రపంచాన్ని ఎలా చూస్తాయో తెలుసుకోవాలని కూడా ఆసక్తి ఉంటుంది. ఇప్పటికిప్పుడు జంతువులుగా మారి వాటి ప్రాపంచిక దృష్టిని పరిచయం చేసే టెక్నాలజీ రాలేదు. కానీ, అవి ఎలా చూస్తాయో ఒక అవగాహన కల్పించే ప్రయత్నం మాత్రం చేసే అవకాశం ఉంది. ఆ ప్రయత్నాన్నే వాషింగ్టన్ యూనివర్సిటీ పరిశోధకులు గతంలో తుమ్మెదల మీద చేశారు, ఇప్పుడు పేడపురుగుల మీద చేస్తున్నారు.

ఈ పరిశోధనలో పేడపురుగుల వీపు మీద ఒక చిన్న తిప్పుకోగల కెమెరాను అమర్చారు. ఈ కెమెరా సెకనుకి 1 నుంచి 5 ఫ్రేముల వీడియోను 60 డిగ్రీల కోణంలో తిప్పుతూ స్ట్రీమ్ చేయగలుగుతుంది. ఈ పరిశోధన ద్వారా సహజ పర్యావరణాన్ని విశ్లేషించి, జీవావరణ అధ్యయనాల్లో వినియోగించుకునే అవకాశం లభిస్తుంది.

డెత్ ఫైనింగ్, పినాకేట్ జాతులకు చెందిన రెండు పేడపురుగుల మీద ఈ కెమెరా బ్యాగును అమర్చారు. ఈ పురుగులు అరగ్రాము బరువును సులభంగా మోసుకెళ్లగలవు కాబట్టి కెమెరా పరికరాన్ని కేవలం పావు గ్రాము మాత్రమే ఉండేలా డిజైన్ చేశారు. అలాగే తక్కువ పవర్ మీద పనిచేసేలా ఈ కెమెరాను రూపొందించారు. అందుకే వీడియో ఫుటేజీని కూడా బ్లాక్ అండ్ వైట్‌లో ఇచ్చేలా మార్చారు. ఒక ఏడాది పాటు అలాగే కెమెరా ఉంచి ఈ పురుగుల జీవనాన్ని, ఇతర ప్రాకృతిక అంశాలను అధ్యయనం చేయనున్నట్లు పరిశోధకులు సాయర్ ముల్లర్, విక్రమ్ అయ్యర్ తెలిపారు. అలాగే వారి ఇతర పరిశోధనలకు అవసరమైన శాంపిళ్లను సేకరించడానికి కూడా ఈ పేడపురుగులు సాయపడతాయని వారు వెల్లడించారు. ఈ పరిశోధనలో భాగంగా తాము పురుగులను ఇబ్బంది పెట్టడం లేదని, వాటి మీద ఒక బ్యాగు ఉన్నట్లే వాటికి తెలియకుండా ఉంటుందని విక్రమ్ అయ్యర్ స్పష్టం చేశారు.



Next Story

Most Viewed