శాస్త్రవేత్తల అద్భుత సృష్టి : చేతి వేళ్ల ‘చెమట’తో కరెంట్ ఉత్పత్తి..

by  |
power
X

దిశ, వెబ్‌డెస్క్ : టెక్నాలజీ, ఇంజనీరింగ్ విప్లవం భవిష్యత్తులో అసాధ్యాలను సుసాధ్యం చేయనున్నాయి. ఇప్పటికే చాలా రంగాల్లో స్మార్ట్ డివైజెస్ సాయంతో ఉద్యోగులు హార్డ్‌వర్క్ చేయడమే మానేశారు. ఇంజనీర్స్ పుణ్యమా అని కంప్యూటర్‌ వర్క్‌ కాస్తా ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లలోనూ ఫినిష్ చేస్తున్నారు. కొన్ని లక్షల రికార్డుల్లో భద్రపరిచే ముఖ్యమైన సమాచారాన్ని కేవలం చిన్న మైక్రో చిప్‌, పాకెట్ హార్డ్‌డిస్క్‌లో భద్రపరుచుకునే టెక్నాలజీ ప్రస్తుతం మన సొంతం. ఇదిలాఉండగా రాను రాను మైక్రో, మ్యాక్రో ఇంజనీరింగ్ సరికొత్త పుంతలు తొక్కనున్నట్లు తెలుస్తోంది.

ఒకప్పుడు ప్రపంచవ్యాపంగా కరెంట్ ఉత్పత్తి అనేది కోల్(బొగ్గు), నీరు, గాలి ద్వారా చేసేవారు. ప్రస్తుతం న్లూక్లియర్ (అణు ధార్మికత) ద్వారా పవర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. అయితే, ఆ టెక్నాలజీ అభివృద్ది చెందిన, చెందుతున్న దేశాల్లో మాత్రమే ఉంది. గ్లోబల్ వార్మింగ్‌ను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్‌లో కర్భన ఉద్గారాలను తగ్గించాలని అగ్రరాజ్యాలతో పాటు అభివృద్ధి చెందుతున్న (ఇండియా) లాంటి దేశాలకు UNO (ఐక్యరాజ్యసమితి) స్పష్టమైన హెచ్చరికలు జారీచేసింది. ఈ క్రమంలోనే ఫ్యూచర్‌లో పర్యావరణానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కొత్త పద్ధతుల్లో మానవ అవసరాలను తీర్చేందుకు శాస్త్రవేత్తలు వివిధ పరిశోధనలు జరుపుతున్నారు.

ఈ నేపథ్యంలోనే కాలిఫోర్నియాలోని శాన్ డియాగో విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ‘చెమట’ నుండి తక్కువ మొత్తంలో విద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు ఉపయోగపడే పరికరాన్ని కనుగొన్నారు. దీనిని వేలిముద్రలో ధరించగలిగే విధంగా అభివృద్ధి చేశారు. ఇందులో ఒక చిప్‌ను అమర్చారు. ఇది వేలు యొక్క ప్రెస్ (ఒత్తిడి)ని మరొక ఎనర్జీ వనరుగా మారుస్తుంది. పరికరాన్ని ధరించాక వేళ్లు నొక్కడం, టైప్ చేయడం మరియు టెక్ట్స్‌టింగ్ చేయడం, వస్తువులను తాకడం వలన కూడా చిన్న ఎలక్ట్రానిక్స్ మరియు సెన్సార్లకు శక్తినిస్తుందని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

Fingertip-powered wearable – YouTube

అయితే, ఈ పరికరం ఒక సన్నని, సౌకర్యవంతమైన స్ట్రిప్, బ్యాండ్-ఎయిడ్ ద్వారా వేలిముద్ర చుట్టూ చుట్టబడుతుంది. కార్బన్ ఫోమ్ ఎలక్ట్రోడ్ల యొక్క పాడింగ్ చెమటను ఇది గ్రహిస్తుంది. అనంతరం దానిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది. ఎలక్ట్రోడ్లు ఎంజైమ్‌లతో అమర్చబడి విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి చెమటలోని లాక్టేట్ మరియు ఆక్సిజన్ అణువుల మధ్య రసాయన ప్రతిచర్యలను ప్రేరేపిస్తాయి. ఎలక్ట్రోడ్ల క్రింద పిజోఎలెక్ట్రిక్ పదార్థం అని పిలువబడే చిప్ ఉంది. ఇది నొక్కినప్పుడు అదనపు విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

ఈ పరికరాన్ని ధరించిన వారు ‘స్ట్రిప్ మీద చెమటలు లేదా నొక్కినప్పుడు, విద్యుత్ శక్తి చిన్న కెపాసిటర్‌లో నిల్వ చేయబడుతుంది’ మరియు అవసరమైనప్పుడు ఇతర పరికరాలకు విడుదల అవుతుంది.

పరిశోధకులు నిశ్చల కార్యకలాపాలు చేసేటప్పుడు దీనిని వేలికొనలకు ధరించి పరీక్షించగా.. మనిషి 10 గంటలు నిద్రపోయే సమయంలో ఈ పరికరం దాదాపు 400 మిల్లీజౌల్స్ శక్తిని సేకరించింది. ఈ శక్తి ఒక ఎలక్ట్రానిక్ రిస్ట్ వాచ్‌ను 24 గంటలు శక్తివంతం(చార్జ్) చేయడానికి సరిపోతుందని ఇంజనీర్లు కనుగొన్నారు. సాధారణంగా టైపింగ్ మరియు మౌస్‌పై క్లిక్ చేసిన ఒక గంటలో ఈ పరికరం దాదాపు 30 మిల్లీజౌల్‌ శక్తిని గ్రహిస్తుందని, అది కూడా ఒక ఫింగ్ టిప్ నుండి మాత్రమే అని తెలిపారు. మిగిలిన వేలికొనలకు పరికరాలను అమర్చి పట్టీ వేయడం వలన 10 రెట్లు ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేస్తుందని పరిశోధకులు స్పష్టం చేశారు.


Next Story

Most Viewed