సూపర్ మార్కెట్‌లో ఉద్యోగులుగా ‘సీఏ సిబ్బంది’

by  |
సూపర్ మార్కెట్‌లో ఉద్యోగులుగా ‘సీఏ సిబ్బంది’
X

కరోనా దెబ్బకు క్రికెట్, క్రికటేతర ఆదాయాలు గణనీయంగా పడిపోవడంతో పలు దేశాల క్రికెట్ బోర్డుల ఖజానాలు నిండుకున్నాయి. ప్రపంచంలో ధనిక క్రికెట్ బోర్డులుగా పేరున్న ఆస్ట్రేలియా, ఇండియా, ఇంగ్లాండ్‌లలో ఒక్క ఇండియా తప్ప మరే క్రికెట్ బోర్డు కూడా పూర్తి స్థాయి వేతనాలు చెల్లించలేదు. బీసీసీఐ కాంట్రాక్టు క్రికెటర్లు, ఆఫీస్ సిబ్బంది, ఇతర అధికారులకు వేతనాలు చెల్లించింది. అయితే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డులు ఇప్పటికే తమ క్రికెటర్ల వేతనాల్లో కోత పెట్టబోతున్నట్లు ప్రకటించాయి. ఇక క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) అయితే బోర్డు అధికారులు, ఉద్యోగులు, ఇతర సిబ్బందికి వేతనాలు అందజేయలేక సతమతమవుతోంది. సాధారణంగా క్రికెట్ సీజన్‌లో కేవలం టికెట్ల రూపంలోనే 40 నుంచి 50 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లను ఆర్జించే సీఏ.. ఇప్పుడు 20 మిలియన్ డాలర్ల నష్టాన్ని చవి చూస్తోంది. దీంతో తమ దగ్గర పని చేసే సిబ్బందిని జూన్ వరకు తాత్కాలికంగా తొలగిస్తున్నట్లు చెప్పింది. కాగా, వారిని తీసేసే ముందు సూపర్ మార్కెట్లో ఉద్యోగాలను వెతికిపెట్టడం కొసమెరుపు.

ఆస్ట్రేలియా జట్టుకు స్పాన్సర్లలో ఒకటైన ఊల్వర్త్స్ సూపర్ మార్కెట్‌లో ఉద్యోగాలు కల్పించేదుకు ప్రయత్నిస్తున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా సీఈవో కెవినె రాబర్ట్స్ తెలిపారు. ఇప్పటికే ఊల్వర్త్స్ సీఈవో బ్రాడ్ బాండుచికి లేఖ రాశామని.. తమ సిబ్బందికి, కల్చర్ టీమ్‌కు సూపర్ మార్కెట్‌లో ఉద్యోగాలు కల్పించాల్సిందిగా ఆయన కోరినట్లు తెలిపారు. మరోవైపు బోర్డులో ఉద్యోగులకు 20 శాతం, అధికారులు 80 శాతం వేతనాలు మాత్రమే చెల్లిస్తున్నట్లు సీఏ వెల్లడించింది. జాతీయ క్రికెట్ కోచ్‌లు కూడా పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుంటున్నారని, భవిష్యత్‌లో క్రికెట్ నిర్వహణ సాధ్యమైతేనే కానీ తిరిగి బోర్డు ఆదాయం పెరగదని సీఈవో రాబర్ట్స్ అంటున్నారు.

Tags :Supermarkets, Cricket Australia, India, BCCI, staff salaries

Next Story

Most Viewed