సీడ్యాక్‌లో 530 ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు:

by Seetharam |
సీడ్యాక్‌లో 530 ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు:
X

దిశ, ఎడ్యుకేషన్: భారత ప్రభుత్వ రంగ సంస్థ.. పుణెలోని సెంటర్ ఫర్ డెవలప్ మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటర్ (సీడ్యాక్).. ప్రాజెక్ట్ ఇంజనీర్, అసోసియేట్, మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు.

మొత్తం పోస్టులు: 530

పోస్టుల వివరాలు:

ప్రాజెక్ట్ అసోసియేట్ - 30

ప్రాజెక్ట్ ఇంజనీర్ - 250

ప్రాజెక్ట్ మేనేజర్ - 50

సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ - 200

అర్హత:

1. ప్రాజెక్ట్ అసోసియేట్: సంబంధిత స్పెషలైజేషన్‌లో బిఈ/బిటెక్ /పీజీ /ఎంఈ /ఎంటెక్ /పీహెచ్‌డి ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: 30 ఏళ్లు ఉండాలి.

జీత భత్యాలు: ఏడాదికి రూ. 3.5 లక్షలు నుంచి రూ. 5.04 లక్షలు ఉంటుంది.

2. ప్రాజెక్ట్ ఇంజనీర్: సంబంధిత స్పెషలైజేషన్‌లో బిఈ /బిటెక్ /పీజీ /ఎంఈ /ఎంటెక్ /పీహెచ్‌డి ఉత్తీర్ణత ఉండాలి.

వయసు: 35 ఏళ్లు ఉండాలి.

జీత భత్యాలు: ఏడాదికి రూ. 4.49 లక్షలు నుంచి రూ. 7.11 లక్షలు ఉంటుంది.

3. ప్రాజెక్ట్ మేనేజర్: సంబంధిత స్పెషలైజేషన్‌లో బిఈ /బిటెక్ /పీజీ /ఎంటెక్ /పీహెచ్‌డి ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: 56 ఏళ్లు ఉండాలి.

జీత భత్యాలు: ఏడాదికి రూ.12.63 లక్షలు నుంచి రూ. 22.9 లక్షలు ఉంటుంది.

4. సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్: సంబంధిత స్పెషలైజేషన్‌లో బిఈ /బిటెక్ /పీజీ /ఎంఈ /ఎంటెక్ /పీహెచ్‌డి ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: 56 ఏళ్లు ఉండాలి.

జీత భత్యాలు: ఏడాదికి రూ. 8.49 లక్షల నుంచి రూ.14 లక్షలు ఉంటుంది.

ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక నిర్వహిస్తారు.

దరఖాస్తు: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

చివరితేది: అక్టోబర్ 20, 2022.

వెబ్ సైట్: https://careers.cdac.ఇన్

Next Story