భారత వృద్ధి అంచనాలను పెంచిన ప్రపంచ బ్యాంకు!

by Disha Web Desk 6 |
భారత వృద్ధి అంచనాలను పెంచిన ప్రపంచ బ్యాంకు!
X

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారత జీడీపీ వృద్ధి అంచనాను 6.5 శాతం నుంచి 6.9 శాతానికి సవరిస్తున్నట్టు ప్రపంచ బ్యాంకు మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ ఏడాది అక్టోబర్‌లో భారత వృద్ధి అంచనాను 7.5 శాతం నుంచి 6.5 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. అయితే, ఇటీవల అంతర్జాతీయంగా మాంద్యం భయాలు ఉన్నప్పటికీ భారత ఆర్థికవ్యవస్థ స్థిరంగా వృద్ధిని కొనసాగిస్తోంది. అందుకే తమ అంచనాలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్టు ప్రపంచ బ్యాంకు అభిప్రాయపడింది.

తాజా ఇండియా డెవలప్‌మెంట్ అప్‌డేట్‌లో, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఇతర ఆర్థికవ్యవస్థల కంటే భారత్ మెరుగైన వృద్ధిని నమోదు చేసిందని తెలిపింది. ప్రపంచ మందగమన్ ప్రభావమ్మ్ భారత్‌పై తక్కువగా ఉంది. దీనివల్ల అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థికవ్యవస్థలలో ఒకటిగా ఉంది. ఇతర ఆర్థికవ్యవస్థల్లో నెలకొన్న ప్రతికూలతను భారత్ అవకాశంగా మార్చుకుంటోందని, ప్రత్యామ్నాయ పెట్టుబడులకు గమ్యస్థానంగా నిలుస్తోందని ప్రపంచ బ్యాంకు వివరించింది. అలాగే, 2022-23 ఆర్థిక సంవత్సరానికి రిటైల్ ద్రవ్యోల్బణం సగటున 7.1 శాతంగా ఉండొచ్చని పేర్కొంది.



Next Story

Most Viewed