ఎంపిక చేసిన కార్ల ధరలను 2 శాతం పెంచిన వోల్వో ఇండియా!

by Disha Web Desk 13 |
ఎంపిక చేసిన కార్ల ధరలను 2 శాతం పెంచిన వోల్వో ఇండియా!
X

న్యూఢిల్లీ: ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ వోల్వో ఇండియా తన పోర్ట్‌ఫోలియోలోని ఎంపిక చేసిన మోడళ్ల ధరలను పెంచుతున్నట్టు బుధవారం ప్రకటించింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో సుంకం పెంపు కారణంగా ఏర్పడే ప్రభావాన్ని అధిగమించేందుకు కంపెనీ తన మైల్డ్-హైబ్రిడ్ మోడళ్ల ధరలను 2 శాతం వరకు పెంచుతున్నామని తెలిపింది. అందులో వోల్వో ఎక్స్‌సీ40, ఎక్స్‌సీ60, ఎస్90, ఎక్స్‌సీ90 మోడల్ కార్లు 1-2 శాతం ఖరీదు కానున్నాయి.

ఈ నెల ప్రారంభంలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రకటనలో కస్టమ్ డ్యూటీని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు తమ పెట్రోల్ మైల్డ్-హైబ్రిడ్ మోడళ్ల ఇన్‌పుట్ ఖర్చులు కూడా పెరిగాయి. దీనివల్ల ఎంపిక చేసిన వాటి ధరలు మాత్రమే పెంచాలని నిర్ణయించామని వోల్వో కార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ జ్యోతి మల్హోత్రా ఓ ప్రకటనలో తెలిపారు. కంపెనీ ధరల పెంపు వల్ల వోల్వో ఎక్స్‌సీ40 బి4 మైల్డ్ హైబ్రిడ్ ఎక్స్‌షోరూమ్ ధర రూ. 46.4 లక్షలు, ఎక్స్‌సీ60 బీ5 మైల్డ్ హైబ్రిడ్ రూ. 67.50 లక్షలు, ఎస్90 బీ5 మైల్డ్ హైబ్రిడ్ రూ. 67.90 లక్షలు, ఎక్స్‌సీ90 బీ6 మైల్డ్ హైబ్రిడ్ ధర రూ. 98.50 లక్షలకు చేరిందని కంపెనీ పేర్కొంది.

Next Story

Most Viewed