ఉచితంగా 'స్విగ్గీ వన్ మెంబర్‌షిప్' అందిస్తున్న వొడాఫోన్ ఐడియా

by Dishanational1 |
ఉచితంగా స్విగ్గీ వన్ మెంబర్‌షిప్ అందిస్తున్న వొడాఫోన్ ఐడియా
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఆర్థిక కష్టాల్లో టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియా వినియోగదారులను కాపాడుకునేందుకు సరికొత్త వ్యూహంతో ముందుకొచ్చింది. ఇప్పటికే ఫుడ్, ట్రావెల్, ఎంటర్‌టైన్‌మెంట్ ప్రయోజనాలతో వివిధ రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తున్న వీఐ మరో కొత్త ఐడియాతో వచ్చింది. ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీకి చెందిన ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ 'స్విగ్గీ వన్ 'ని ఉచితంగా యాక్సెస్ చేసుకునే సదుపాయాన్ని వొడాఫోన్ ఐడియా ప్రారంభించింది. కంపెనీ పోస్ట్‌పెయిడ్ మొబైల్ రీఛార్జ్ ఎంచుకునే వినియోగదారులు రూ. 2,500 కంటే ఎక్కువ విలువైన 'స్విగ్గీ వన్ మెంబర్‌షిప్'ని అదనపు ఖర్చు లేకుండా పొందవచ్చు. వీఐ మ్యాక్స్ పోస్ట్‌పెయిడ్ వినియోగదారులు రూ. 501, రూ. 701, రెడ్ఎక్స్ ప్లాన్ రూ. 1,101, అలాగే, వీఐ మ్యాక్స్ ఫ్యామిలీ రూ. 1,001, రూ. 1,151 ప్లాన్‌లపై ఈ స్విగ్గీ ప్రీమియం ప్రయోజనాలను పొందవచ్చని కంపెనీ బుధవారం ప్రకటనలో వెల్లడించింది. ఇప్పటికే వొడాఫోన్ ఐడియా తన వీఐ మ్యాక్స్ పోస్ట్‌పెయిడ్ పర్సనల్, ఫ్యామిలీ ప్లాన్‌లలో ఓటీటీలు ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, సోనీలివ్, ట్రావెల్‌కు చెందిన ఈజీమైట్రిప్, సెక్యూరిటీ ప్రొవైడర్ నార్టన్ 360, ఫుడ్ యాప్ ఈజీడైనర్ ప్రయోజనాలను అందిస్తోంది. ఇప్పుడు స్విగ్గీ వన్‌ని కూడా ఇందులో చేర్చింది.

Next Story

Most Viewed