దివాలాకు వెళ్లకుండా అమెరికాకు భారీ ఊరట!

by Dishaweb |
దివాలాకు వెళ్లకుండా అమెరికాకు భారీ ఊరట!
X

వాషింగ్టన్: దివాలా అంచున ఉన్న అగ్రరాజ్యం అమెరికాకు భారీ ఊరట లభించినంది. ఆ దేశం రుణ పరిమితిని పెంచేందుకు అధ్యక్షుడు జో బైడెన్, స్పీకర్ కెవిన్ మెకార్థి మధ్య ప్రాథమిక ఒప్పందం జరిగింది. రెండేళ్ల వరకు రుణ పరిమితిని పెంచి, వ్యయ నియంత్రణపై అమెరికా అధికార ప్రభుత్వం, ప్రతినిధుల సభలోని రిపబ్లికన్లు సూత్రప్రాయంగా ఒప్పందానికి వచ్చారు. అమెరికా దివాలాకు చేరిన నేపథ్యంలో తాజా సూత్రప్రాయ ఒప్పందం కాంగ్రెస్‌లోని తమ పార్టీ వారితో ఆమోదముద్ర వేయించాల్సి ఉంటుంది. ప్రతినిధుల సభలో రిపబ్లికన్ల ఆధిపత్యం ఉండగా, సెనెట్‌లో డెమొక్రాట్లు ఎక్కువ ఉన్నారు. తాజా ఒప్పందం జూన్ 5వ తేదీ నాటికి ఆమోదం పొందాల్సి ఉంది. అనంతరం జో బైడెన్ సంతకం తర్వాత రుణ పరిమితి పెంపు అమల్లోకి వస్తుంది. ఆలోపు ఒప్పందం అమలు కాకపోతే అమెరికా అప్పులు చెల్లించే పరిస్థితి ఉండదని అమెరికా ఆర్థిక మంత్రి ఇటీవల హెచ్చరించారు.

అనేక వారాల పాటు సుధీర్ఘ చర్చలు ముగిశాక తాము ఈ ఒప్పందానికి వచ్చామని స్పీకర్ కెవిన్ మెకార్థి అన్నారు. రుణ పరిమితి పెంపునకు ఇంకా ప్రక్రియ జరగాల్సి ఉందని, ఇది అమెరికా ప్రజలకు ఎంతో కీలకమని కెవిన్ పేర్కొన్నారు. కాగా, ప్రస్తుతం అమెరికా రుణ పరిమితి 31.4 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. ఈ పరిమితి దాటి అమెరికా అప్పులు చేసేందుకు వీల్లేదు. ప్రతినిధుల సభలో సంఖ్యాపరంగా రిపబ్లికన్లు ఎక్కువగా ఉండటంతో ఈ వ్యవహారం దివాలా వరకు వచ్చింది. ఇప్పుడు ఇరువురి మధ్య ఒప్పందం జరగడంతో అమెరికా దివాలాకు వెళ్లకుండా బయటపడింది.


Next Story

Most Viewed