UPI Transactions: 11 నెలల్లో 15,547 కోట్ల యూపీఐ లావాదేవీలు: కేంద్ర ఆర్థికశాఖ

by Maddikunta Saikiran |
UPI Transactions: 11 నెలల్లో 15,547 కోట్ల యూపీఐ లావాదేవీలు: కేంద్ర ఆర్థికశాఖ
X

దిశ, వెబ్‌డెస్క్: భారతదేశం(India)లో ఇటీవల కాలంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్(UPI) లావాదేవీలు గణనీయంగా పెరిగిన పెరిగిన విషయం తెలిసిందే. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్(Smartphone) వినియోగం పెరిగిన తర్వాత ఈ లావాదేవీలు ఉపందుకున్నాయి. సామాన్యుల నుంచి సంపన్నుల వరకూ ప్రతి ఒక్కరూ డిజిటల్ లావాదేవీలు నిర్వహిస్తున్నారు. దీంతో రోజుకు కొన్ని లక్షల కోట్ల విలువైన లావాదేవీలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ వరకు 15,547 కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ(Finance Ministry) శనివారం వెల్లడించింది. ఈ లావాదేవీల విలువ సుమారు రూ. 223 లక్షల కోట్లుగా ఉంటుందని తెలిపింది.

కాగా ఇప్పుడు యూఏఈ, సింగపూర్, భూటాన్, నేపాల్, శ్రీలంక, ఫ్రాన్స్, మారిషస్ వంటి దేశాలలో కూడా యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చాయి. కాగా యూపీఐ సేవలును నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(RBI) 2016లో ప్రారంభించింది. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూపీఐ లైట్ లిమిట్ ను ఒక్కో లావాదేవికి రూ. 500 నుంచి రూ. 1000 వరకు, ఇక యూపీఐ లైట్ వ్యాలెట్ పరిమితిని రూ. 2,000 నుంచి రూ. 5,000 వరకు పెంచుతూ ఇటీవలే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed