వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇక అన్నీ ఆన్‌లైన్‌లోనే

by Dishafeatures2 |
వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇక అన్నీ ఆన్‌లైన్‌లోనే
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రతిరోజూ మనకెన్నో అవసరాల కోసం ఆర్‌టీఓ ఆఫీసుకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఇకపై ఇలా కొన్ని సేవలను వినియోగించేందుకు ఆర్‌టీఓ ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇందు కోసం 58 పౌర కేంద్రీకృత సేవలను ఆన్‌లైన్‌ చేసేందుకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ తాజా నోటిఫికేషన్ విడుదల చేసింది.

వీటిలో డ్రైవింగ్ లైసెన్స్, కండక్టర్ లైసెన్స్, వెహికల్ రిజిస్ట్రేషన్, పెర్మిట్, ఓనర్‌షిప్ ట్రాన్స్‌ఫర్‌ సమా మరిన్ని కూడా ఉండనున్నాయి. ఈ సేవలను వినియోగించేందుకు ఆర్‌టీఓ ఆఫీసుకు వెళ్లకుండా అందించేందుకు ఆన్‌లైన్ సేవ తీసుకొచ్చామని, వీటిని కేవలం స్వచ్ఛంద ప్రాతిపదికన ఆధార్ ప్రమాణీకరణ ద్వారా వినియోగించవచ్చని మంత్రిత్వ శాఖ తాజా ఓ స్టేట్‌మెంట్‌లో తెలిపింది.

'ఇటువంటి సెవలను కాంటాక్ట్‌లెస్, ఫేస్‌లెస్ పద్దతిలో అందించడం ద్వారా పౌరుల విలువైన సమయాన్ని ఆదా చేయడంలో సహాయపడుతుంది. దాంతో పాటుగా ఆర్‌టీఓ ఆఫీసుకు వెళ్లేవారి సంఖ్యను చాలా వరకు తగ్గిస్తుందని, కాబట్టి అక్కడి వారు వారి విధులను సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు' అని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అంతేకాకుండా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. ఎవరికైనా ఆధార్ కార్డ్ లేని వారు సీఎంవీఆర్ 1989 ప్రకారం సంబంధిత అధికారి ద్వారా తీసుకున్న ఇతర పత్రం భౌతికంగా అందించడం ద్వారా ఈ సేవలను వినియోగించుకోవచ్చని తెలిపింది.

ఇవి కూడా చ‌ద‌వండి :

పక్కింట్లో పూలు కోస్తే.. వచ్చే జన్మలో ఎలా పుడుతారో తెలుసా?


Next Story