క్లెయిమ్ చేయని రూ. 35,012 కోట్ల విలువైన డిపాజిట్లు!

by Harish |
క్లెయిమ్ చేయని రూ. 35,012 కోట్ల విలువైన డిపాజిట్లు!
X

న్యూఢిల్లీ: ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి దాదాపు రూ. 35,012 కోట్ల క్లెయిమ్ చేయని డిపాజిట్లను ప్రభుత్వ రంగ బ్యాంకు(పీఎస్‌బీ)లు ఆర్‌బీఐకి బదిలీ చేశాయని కేంద్రం పార్లమెంటుకు తెలియజేసింది. అవి 10 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలంగా నిర్వహించని డిపాజిట్లని, ఆ మొత్తం 10.24 కోట్ల ఖాతాలకు చెందినవని కేంద్రం మంత్రి భగవత్ కరాడ్ లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. అందులో ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్‌బీఐ రూ. 8,086 కోట్లతో అత్యధిక క్లెయిమ్ చేయని డిపాజిట్లకు కలిగి ఉంది.

దీని తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ. 5,340 కోట్లు, కెనరా బ్యాంక్ రూ. 4,558 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా రూ. 3,904 కోట్లను కలిగి ఉన్నాయి. కాగా, పనిచేయని ఖాతాలకు చెందిన వినియోగదారుల ఆచూకీని కనుగొనడంలో మరింత క్రియాశీల పాత్ర పోషించాలని ఆర్‌బీఐ బ్యాంకులకు సూచించినట్టు ఎస్‌బీఐ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.

మరో ప్రశ్నకు భగవంత్ కరాడ్ జవాబిస్తూ, 2021-22 కేంద్ర బడ్జెట్‌లో ప్రభుత్వం చెప్పిన రెండు ప్రభుత్వం రంగ బ్యాంకులు, ఒక ప్రభుత్వ రంగ సాధారణ బీమా సంస్థ ప్రైవేటీకరణకు సంబంధించి నిబంధనలు, షరతులపై నిర్ణయం కోసం కేబినెట్ కమిటీని కోరడం జరిగింది. ప్రైవేటీకరణ ప్రక్రియకు ముందు సంబంధిత చట్టాల్లో సవరణ అవసరమని చెప్పారు. ఇంకా, పీఎస్‌బీల ప్రైవేటీకరణ సహా వివిధ సమస్యలపై అభిప్రాయాలు, సిఫార్సులను ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిశీలిస్తోందని పేర్కొన్నారు.

Also Read..

సామాన్యులకు కేంద్రం ఊరట.. ఔషధాల ధరలు తగ్గింపు!

Next Story