- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
దేశంలోనే అత్యంత స్పీడ్‌గా వెళ్లే స్పోర్ట్ మోడల్ ఎలక్ట్రిక్ బైక్

దిశ, వెబ్‌డెస్క్: అల్ట్రావయోలెట్ కంపెనీ భారత్‌లో కొత్తగా ఎలక్ట్రిక్ బైక్‌ను విడుదల చేసింది. దీని పేరు 'Ultraviolette F77'. మార్కెట్లో పెరుగుతున్న ఎలక్ట్రిక్ బైక్‌ల డిమాండ్‌ను తీర్చడానికి ఇది బాగా ఉపయోగపడుతుందని, అలాగే దీని డిజైన్ స్పోర్ట్ మోడల్‌లాగా ఉండి, వినియోగదారులకు నచ్చుతుందని కంపెనీ పేర్కొంది. ఇది రీకాన్, ఒరిజినల్ అనే రెండు వేరియంట్‌లలో లభిస్తుంది.
ఒరిజినల్ వేరియంట్ ధర రూ. 3.80 లక్షలు, రీకాన్ ధర రూ. 4.55 లక్షలు. ఎయిర్‌స్ట్రైక్, లేజర్, షాడో అనే మూడు కలర్స్‌లలో అమ్మకానికి ఉంది. బైక్ డెలివరీలు 2023 జనవరి నుంచి ప్రారంభమవుతాయి. ఎలక్ట్రిక్ బైకుని బుక్ చేసుకోవాలనుకునే వారు కంపెనీ అధికారిక వెబ్‌సైట్ లో రూ. 10,000 చెల్లించడం ద్వారా ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చు
Ultraviolette F77 దేశంలోనే అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ బైక్‌గా ఉంది. ఇది 150 Km/h గరిష్ట వేగం తో ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది. బైక్ ముందు, వెనుక డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. రెండు బైక్‌లు స్మార్ట్ TFT డిస్‌ప్లేను కలిగి ఉంటాయి. ఒరిజినల్ వేరియంట్‌లో 7.1kWh బ్యాటరీతో, 85Nm శక్తిని అందించే 27kW మోటార్‌ను అమర్చారు. ఇది ఒక్కచార్జ్‌తో 206 km దూరం ప్రయాణిస్తుంది.
అలాగే రీకాన్ వేరియంట్ 29 kW పవర్, 90 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఒక్కచార్జ్‌తో 307km దూర పరిధిని కలిగి ఉంది. రెండు బైక్‌లకు స్మార్ట్ ఫోన్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా రియల్ టైమ్ లొకేషన్, క్రాష్ డిటెక్షన్, రైడ్ అనలిటిక్స్, బ్యాటరీ స్టాటిస్టిక్స్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
F77 వేరియంట్‌లోని బ్యాటరీకి 3 సంవత్సరాలు లేదా 30,000 కి.మీ వారంటీ ఉంటుంది. అలాగే, రీకాన్ వేరియంట్ బ్యాటరీ పై 5 సంవత్సరాలు లేదా 50,000 కి.మీ వారంటీ ఉంది.
అల్ట్రావయోలెట్ ఇంకో మోడల్ 'F77 లిమిటెడ్ ఎడిషన్' 77 యూనిట్లు మాత్రమే అమ్మకానికి ఉన్నాయి. దీని ధర రూ. 5.50 లక్షలు. ఇది కూడా ఒక్కచార్జింగ్‌పై 307km దూరాన్ని అందిస్తుంది. దీని బ్యాటరీ పై 8 సంవత్సరాలు లేదా 1,00,000 కి.మీ బ్యాటరీ వారంటీని కంపెనీ అందిస్తుంది.