సెప్టెంబర్ త్రైమాసికంలో 16 శాతం పెరిగిన ఆల్ట్రాటెక్ సిమెంట్ ఉత్పత్తి!

by Vinod kumar |
సెప్టెంబర్ త్రైమాసికంలో 16 శాతం పెరిగిన ఆల్ట్రాటెక్ సిమెంట్ ఉత్పత్తి!
X

ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి సిమెంట్ తయారీ సంస్థ ఆల్ట్రాటెక్ సిమెంట్ అమ్మకాలు 15.54 శాతం పెరిగి 2.66 కోట్ల టన్నులకు చేరుకున్నాయని వెల్లడించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ 2.3 కోట్ల టన్నుల సిమెంట్‌ను ఉత్పత్తి చేసినట్టు ఆదిత్య బిర్లా గ్రూప్ తెలిపింది. సమీక్షించిన త్రైమాసికంలో కంపెనీ దేశీయ అమ్మకాలు మాత్రమే 15.37 శాతం పెరిగి 2.56 కోట్ల టన్నులకు చేరుకున్నాయి.

ఎగుమతులు 21.64 శాతం పెరిగి 11.8 లక్షల టన్నులుగా నమోదయ్యాయి. ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద సిమెంట్ ఉత్పత్తి కంపెనీగా ఉన్న ఆల్ట్రాటెక్ సిమెంట్ ఏటా 13.78 కోట్ల టన్నుల గ్రే సిమెంట్ తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. సంస్థకు 23 ఇంటిగ్రేటెడ్ తయారీ యూనిట్లు, 29 గ్రైండింగ్ యూనిట్లు, ఒక క్లింకరైజేషన్ యూనిట్, ఎనిమిది బల్క్ ప్యాకేజింగ్ టెర్మినల్స్ ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed