Truecaller కొత్త ఫీచర్: ఇక నుంచి మోసపూరిత కాల్స్‌ను తెలుసుకోవడం చాలా ఈజీ

by Disha Web Desk 17 |
Truecaller కొత్త ఫీచర్: ఇక నుంచి మోసపూరిత కాల్స్‌ను తెలుసుకోవడం చాలా ఈజీ
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ కాలర్ ఐడెంటిఫికేషన్ యాప్ ట్రూకాలర్ దేశీయంగా వినియోగదారుల కోసం కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ప్రభుత్వ అధికారులమంటూ వచ్చే మోసపూరిత కాల్స్ పట్ల ప్రజలకు హెచ్చరిక చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, కార్యాలయాలు, ప్రజాప్రతినిధులు, మంత్రిత్వశాఖల ఫోన్ నంబర్లను సులభంగా గుర్తించడానికి గవర్నమెంట్ డిజిటల్ డైరెక్టరీ పేరుతో ఫోన్ల నంబర్ల లిస్ట్‌ను తయారు చేసింది. దీని ద్వారా ప్రభుత్వ అధికారులమని ఎవరైనా కాల్ చేస్తే అది అసలు నంబర్ అవునా, కాదా అని తెలుసుకోవచ్చు. అలాగే సంబంధిత ప్రభుత్వ అధికారులకు తమ సమస్యలను ఫోన్ ద్వారా తెలియజేయవచ్చు.


ఏదైనా నంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చినప్పుడు ఫోన్ స్క్రీన్ బ్యాక్‌గ్రౌండ్‌లో గ్రీన్ కలర్, ఫోన్ నంబర్ ప్రక్కన బ్లూటిక్ కనిపిస్తుంది. ఇలా ఉండటం వలన ఇది వెరిఫైడ్ నంబర్ అని వినియోగదారులకు తెలుస్తుందని ట్రూకాలర్ పేర్కొంది. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన ఈ ఫీచర్‌ను పొందడానికి ట్రూకాలర్ యాప్‌‌‌ను వెంటనే అప్‌డేట్ చేసుకోవాలి. ఈ మధ్య కాలంలో మోసపూరిత కాల్స్ ఎక్కువగా ప్రభుత్వ అధికారులమంటూ వస్తున్నాయని, వీటిని అరికట్టడానికి ఈ ఫీచర్‌ను తీసుకొచ్చినట్లు ట్రూకాలర్ పేర్కొంది.


Next Story