- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- కార్టూన్
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- Bigg Boss Telugu 7
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
- ICC World Cup 2023
అక్టోబర్ 1 నుంచి డెబిట్, క్రెడిట్ కార్డు కొత్త రూల్స్.. ఇది తప్పనిసరి

దిశ, వెబ్‌డెస్క్: భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల ప్రకటించిన విధంగా అక్టోబర్ 1 నుంచి టోకనైజేషన్ విధానాన్ని అమలు చేయడానికి సిద్ధమైంది. ఇంతకుముందు 2021 జూన్ 30వ తేదీ నుంచి దీనిని అమలు చేయడానికి ప్రయత్నించారు. కానీ వివిధ కారణాల వలన దీని గడువును పెంచుతూ వస్తున్నారు. డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్‌ల దుర్వినియోగం పెరుగుతున్న సంఘటనల దృష్ట్యా కార్డ్ టోకనైజేషన్ నిబంధనలు అమలు చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.
పాయింట్ ఆఫ్ సేల్‌లో భాగంగా కార్డు వివరాలు టోకెన్ అనే ప్రత్యేకమైన కోడ్‌తో ఉంటాయి. టోకనైజేషన్ అంటే 16-అంకెల సంఖ్య, పేరు, గడువు తేదీలు వంటి వివరాలు కోడ్‌ల రూపంలో సేవ్ చేయబడి ఉంటాయి. దీని వలన కార్డ్‌ల వివరాలు లావాదేవీల టైంలో వ్యాపార సంస్థల వద్ద ఉండవు. వీటిని షేర్ చేయడానికి కూడా కుదరదు. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ఈ కామర్స్ సంస్థలలో లావాదేవీలు చేసే టైం లో కార్డు వివరాలు సేవ్ కావు. టోకెన్‌గా ఉండేటటువంటి ప్రత్యేకమైన కోడ్ ద్వారా మాత్రమే లావాదేవీలు సేవ్ చేయబడి, దీని ద్వారానే ట్రాన్సాక్షన్ చేయడానికి అనుమతి ఉంటుంది.
వినియోగదారులు టోకనైజేషన్ పొందడానికి చెల్లింపు సైట్‌లో 'టోకెన్ రిక్వెస్ట్' ను పెట్టవచ్చు. దీనిని పరగణలోకి తీసుకుని సంబంధిత నెట్‌వర్క్ సంస్థ టోకెన్‌ను జారీ చేస్తుంది. ఒక్కొక్క యాప్‌కు ఒక్కొ టోకెన్ నంబర్ ఉంటుంది. వినియోగదారులు కొనుగోలు టైంలో కార్డు వివరాలు ఎంటర్ చేశాకా, వ్యాపారికి టోకెన్‌ను సెండ్ చేస్తారు. కార్డు వివరాల స్థానంలో ఈ నెంబర్ సేవ్ చేయబడి లావాదేవీ పూర్తవుతుంది. మరోసారి చెల్లింపులు చేసినప్పుడు సేవ్ చేసిన కార్డ్ చివరి నాలుగు అంకెలు కనిపిస్తాయి. దీంతో కార్డు టోకనైజేషన్ పూర్తయినట్టు చూపిస్తుంది. సైబర్ నేరగాళ్ల నుండి కార్డు వివరాలు, లావాదేవీలకు సంబంధించిన డేటా కాపాడటానికి టోకనైజేషన్ బాగా ఉపయోగపడుతుందని అధికారులు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి :