ప్రాణప్రతిష్ట వేడుక పురస్కరించుకుని స్పైస్‌జెట్ 'ప్రత్యేక సేల్'

by Dishanational1 |
ప్రాణప్రతిష్ట వేడుక పురస్కరించుకుని స్పైస్‌జెట్ ప్రత్యేక సేల్
X

దిశ, బిజినెస్ బ్యూరో: అయోధ్యలోని రామమందిరం 'ప్రాణప్రతిష్ఠ' వేడుకను పురస్కరించుకుని ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ ప్రత్యేక సేల్‌ను ప్రకటించింది. ఇందులో కనిష్టంగా రూ. 1,622కే టికెట్ ధరలు ప్రారంభమవుతాయని, దేశీయ, అంతర్జాతీయంగా అన్ని రూట్లకు(వన్-వే) ఈ సేల్ వర్తిస్తుందని కంపెనీ వెల్లడించింది. స్పైస్‌మ్యాక్స్, యూఫస్ట్ లాంటి యాడ్-ఆన్‌తో పాటు ఎంపిక చేసిన ఛార్జీలపై అదనంగా మరో 30 శాతం రాయితీ ఉంటుందని పేర్కొంది. ఈ సేల్‌లో విమాన టికెట్లను కొనుగోలు చేసిన ప్రయాణికులు విమానం బయలుదేరే 96 గంటలకు ముందు వరకు ప్రయాణ తేదీని ఎలాంటి రుసుము లేకుండా మార్చుకునే అవకాశం కల్పిస్తున్నట్టు స్పైస్‌జెట్ వివరించింది. మొబైల్, యాప్, అధికారిక వెబ్‌సైట్, రిజర్వేషన్ కౌంటర్లు, ఎమ్‌సైట్, ట్రావెల్ ఏజెంట్ల వద్ద ఈ సేల్ టికెంట్లను కొనుగోలు చేయవచ్చు. ఇక, ఈ నెల 22 నుంచి 28వ తేదీల మధ్య బుక్ చేసుకున్న టికెట్లకు ఈ ఆఫర్లు వర్తిస్తాయని, అలాగే, జనవరి 22 నుంచి సెప్టెంబర్ 30వ తేదీ మధ్య ప్రయాణం చేయాల్సి ఉంటుందని కంపెనీ తెలిపింది. ముంబై-గోవా, ఢిల్లీ-జైపూర్‌, గౌహతీ-బాగ్‌డోగ్రా వంటి ప్రధాన మార్గాల్లో కనిష్ట ధర రూ.1,622 వర్తించనుంది. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని ఎయిర్ కనెక్టివిటీని మరింత మెరుగుపరచడానికి స్పైస్‌జెట్ వివిధ నగరాలకు ఫిబ్రవరి 1 నుంచి ప్రత్యేక విమానాలను ప్రారంభించనుంది.

Next Story

Most Viewed