ఫిబ్రవరి నెలలో బ్యాంకింగ్ సెలవుల లిస్టు ఇదే

by Disha Web |
ఫిబ్రవరి నెలలో బ్యాంకింగ్ సెలవుల లిస్టు ఇదే
X

దిశ, వెబ్ డెస్క్ : ఫిబ్రవరి నెలలో బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. సెలవు ఉన్న రోజులు బ్యాంకులు పని చేయవు కాబట్టి డబ్బు అవసరం ఉన్న వారు ముందుగా బ్యాంకుకు వెళ్లి మీ పనులను చేసుకోవడం ఉత్తమం.ఏ ఏ రోజులు బ్యాంకులు సెలవులో ఇక్కడ చూద్దాం. ఫిబ్రవరి 5న హజరత్ అలి జయంతి మరియు అదే రోజున ఆదివారం కూడా వచ్చింది. కాబట్టి ఆ రోజు బ్యాంకుకు సెలవు ఉంటుంది. పిబ్రవరి 11న రెండో శనివారం, ఆ రోజు కూడా బ్యాంక్ హాలిడే ఉంటుంది. ఫిబ్రవరి 12న ఆదివారం సెలవు. ఫిబ్రవరి 15న లీ ఎన్‌గై ని సందర్భంగా బ్యాంకులు పని చేయవు. ఆ రోజున మణిపూర్‌లో బ్యాంకులు పని చేయవు. ఫిబ్రవరి 18న మహా శివరాత్రి పండుగ కాబట్టి ఆ రోజున కూడా బ్యాంకులు పని చేయవు. ఫిబ్రవరి 19న శివాజీ మహరాజ్ జయంతి మరియు ఆదివారం వచ్చింది.. ఆ రోజు కూడా బ్యాంకులు సెలవు. ఫిబ్రవరి 20న స్టేట్ డే కాబట్టి బ్యాంకులకు హాలీ డే. ఫిబ్రవరి 21న లోసర్ సందర్బం సిక్కిమ్‌లో బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఫిబ్రవరి 25న శనివారం వచ్చింది. ఆ రోజు కూడా బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఫిబ్రవరి 26న ఆదివారం వచ్చింది. బ్యాంకులకు సెలవులు ఉన్నా ఆన్లైన్లో సేవలు అందుబాటులో ఉంటాయి.


Next Story