ఇండియా మార్కెట్లోకి త్వరలో రాబోతున్న టాప్ కార్లు ఇవే!

by Disha Web Desk 17 |
ఇండియా మార్కెట్లోకి త్వరలో రాబోతున్న టాప్ కార్లు ఇవే!
X

దిశ, వెబ్‌డెస్క్: భారత మార్కెట్లో కార్ల అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. ప్రజల ఆదాయం పెరగడంతో కార్ల కొనుగోలు పట్ల వారు మొగ్గుచూపుతున్నారు. ఒకప్పుడు ఇంటికి ఒక బైక్ ఉండగా, ఇప్పుడు కార్లు ఉంటున్నాయి. దీంతో ప్రపంచ ఆటోమొబైల్ తయారీ కంపెనీలు భారత్‌లో వరుసగా కొత్త కొత్త కార్లను విడుదల చేస్తున్నాయి. ఇప్పటికే 2023 ప్రారంభంలో కొన్ని కొత్త మోడళ్లు మార్కెట్లోకి అందుబాటులోకి రాగా, మరిన్ని కొత్త మోడళ్లు అతి త్వరలో లాంచ్ కానున్నాయి. ఆ కార్లు ఏంటో ఒకసారి చూద్దాం..

1. మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్: ఈ SUV కారు మే నెలలో విడుదల కానుంది. అంచనాల ప్రకారం, ప్రారంభ ధర దాదాపు రూ.12 లక్షలు (ఎక్స్-షోరూమ్). మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్ జీటా, ఆల్ఫా అనే రెండు ట్రిమ్‌లతో విడుదల కానుంది. ఇది 1.5 లీటర్ K15B పెట్రోల్ ఇంజన్‌తో రానుంది. 105 bhp, 134 Nm గరిష్ట టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, 5-స్పీడ్ మాన్యువల్, 4-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.


2. మారుతి సుజుకి ఇన్నోవా హైక్రాస్ బేస్డ్ ప్రీమియం MPV: మారుతి సుజుకి MPV టయోటా ఇన్నోవా కారు హైక్రాస్‌పై ఆధారపడి ఉంటుంది. దీని ఎక్ట్సీరియర్ డిజైన్‌లో కొన్ని మార్పులు ఉండే అవకాశం ఉంది. అలాగే, సుజుకి లోగో మినహా ఇంటీరియర్‌లు ఒకే విధంగా ఉంటాయి. దీని ధర గురించి పూర్తి వివరాలు తెలియనప్పటికీ, అంచనాల ఆధారంగా ఇది అత్యంత ఖరీదుతో రానున్నట్లు సమాచారం. ఈ కారు జులై నెలలో లాంచ్ కానుంది.
3. టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్: ప్రస్తుతం ఇండియాలో అత్యధికంగా అమ్ముడవుతన్న కార్లలో టాటా నెక్సాన్ కాంపాక్ట్ SUV ఫేస్‌లిఫ్ట్‌ ఒకటి. దీని లేటెస్ట్ వెర్షన్ ఇప్పుడు రాబోతుంది. పాత మోడల్ తో పోల్చితే కొత్తగా డిజైన్‌లో కొన్ని మార్పులు చేశారు. ఇది 2 స్పోక్ స్టీరింగ్ వీల్, ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, కనెక్టెడ్ కార్ టెక్ వంటి ఫీచర్లతో వస్తుందని సమాచారం. 1.2-లీటర్ tGDi పెట్రోల్ ఇంజన్ 125 bhp, 225 Nm గరిష్ట టార్క్‌ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే, 6-స్పీడ్ మాన్యువల్ యూనిట్‌తో పాటు DCT గేర్‌బాక్స్‌ తో వస్తుంది.4. హ్యుందాయ్ ఎక్స్‌టర్: ఈ మోడల్ కారు ఆగస్టులో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇది 1.2 లీటర్ కప్పా పెట్రోల్ ఇంజన్‌తో పాటు పనితీరు-ఆధారిత 1.0-లీటర్ tGDi పెట్రోల్ యూనిట్‌తో అందించబడుతుంది. దాంతో పాటు CNG ఎంపికలో కూడా వస్తున్నట్లు సమాచారం.
Next Story