ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ ఇచ్చే బ్యాంకులు ఇవే!

by Disha Web Desk 17 |
ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ ఇచ్చే బ్యాంకులు ఇవే!
X

దిశ, వెబ్‌డెస్క్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల రెపో రేటును పెంచడంతో వరుసగా బ్యాంకులు కూడా తమ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. ప్రభుత్వ బ్యాంకుల నుంచి మొదలుకుని ప్రైవేటు బ్యాంకుల వరకు అన్ని కూడా దాదాపు ఒకే వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. ముఖ్యంగా చిన్న బ్యాంకులు వినియోగాదారులను ఆకట్టుకోడానికి ఎక్కువ వడ్డీరేట్లను ఆఫర్ చేస్తున్నాయి. వివిధ కాలవ్యవధులను బట్టి వడ్డీ రేట్లు పలు రకాలుగా ఉన్నాయి.

ఏ ఏ బ్యాంకులు ఎంత వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తున్నాయో ఒకసారి చూద్దాం..

యూనియన్ బ్యాంక్

ప్రభుత్వ రంగ బ్యాంకు అయినటువంటి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినియోగదారులకు అత్యధిక వడ్డీ రేటును అందిస్తుంది. మూడేళ్ల కాలపరిమితిపై 7.30 శాతం వడ్డీ రేటు ఇస్తోంది.

AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్

ఈ రెండు బ్యాంకులు కూడా తమ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.75 శాతం వడ్డీని అందిస్తాయి. మూడేళ్ల వరకు ఉన్న పెట్టుబడులపై ఈ రేటు వర్తిస్తుంది. ఈ వడ్డీరేటు ప్రకారం, రూ. లక్ష మొత్తం మూడేళ్లలో రూ.1.26 లక్షలు అవుతుంది.

IDFC ఫస్ట్ బ్యాంక్

ఈ బ్యాంకు కూడా తన వినియోగదారులకు మంచి వడ్డీ రేటును ఆఫర్ చేస్తుంది. మూడు సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.50 శాతం వడ్డీని అందిస్తుంది. దీనిలో రూ. 1 లక్ష మొత్తం మూడేళ్లలో రూ. 1.25 లక్షలకు పెరుగుతుంది.

DCB బ్యాంక్

ప్రైవేట్ బ్యాంకులలో ఇది అత్యధికంగా 7.85 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తుంది.

అలాగే, బంధన్ బ్యాంక్, సిటీ యూనియన్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మూడేళ్ల కాలవ్యవధితో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.25 శాతం వడ్డీని అందిస్తున్నాయి.


Next Story

Most Viewed