ప్లాంటు ఏర్పాటు కోసం మూడు రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇస్తున్న టెస్లా

by S Gopi |
ప్లాంటు ఏర్పాటు కోసం మూడు రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇస్తున్న టెస్లా
X

దిశ, బిజినెస్ బ్యూరో: గ్లోబల్ ఈవీ కార్ల తయారీ దిగ్గజం టెస్లా భారత్‌కు రానున్న సంగతి తెలిసిందే. దేశీయంగా తన ఎలక్ట్రిక్ కార్ల తయారీ ప్లాంటు కోసం టెస్లా ఈ నెలలో భారత్‌లో పర్యటించనుంది. ఈ ప్లాంటు విలువ 2-3 బిలియన్ డాలర్లు(మన కరెన్సీలో సుమారు రూ. 25 వేల కోట్లు) ఉండొచ్చని అంచనా. దేశీయంగానే తయారీకి సిద్ధంగా ఉన్న కంపెనీల కోసం దిగుమతి చేసుకున్న ఈవీలపై కేంద్ర ప్రభుత్వం ఇటీవల పన్నులను తగ్గించింది. ఈ నేపథ్యంలో స్థానిక ఉత్పత్తికి టెస్లా ముందడుగు వేసింది. ప్రధానంగా ఇప్పటికే ఆటోమోటివ్ హబ్‌లుగా ఉన్న మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ప్లాంటు ఏర్పాటు విషయమై కంపెనీ ప్రాధాన్యత ఇస్తుందని పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. ఏప్రిల్ చివరి నటికి అమెరికా నుంచి తన టీమ్‌ను భారత్‌కు పంపాలని కంపెనీ భావిస్తోంది. హర్యానాలో కొన్ని కంపెనీలు ఉత్పత్తిని నిర్వహిస్తున్నప్పటికీ టెస్లా ప్రధానంగా కార్ల ఎగుమతులను సులభతరం చేసే ఓడరేవు సౌకర్యాలు ఉన్న రాష్ట్రాలపై ఉండనుంది. ఏటా 5 లక్షల కార్ల ఉత్పత్తి సామర్థ్యం సాధించే లక్ష్యంతో పాటు భవిష్యత్తులో బ్యాటరీ ప్లాంటు కోసం గిగాఫ్యాక్టరీ ప్రణాళికను కూడా టెస్లా కలిగి ఉంది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకునే కంపెనీ ప్లాంటు ఏర్పాటు చేయనుంది.Next Story

Most Viewed