1.1 మిలియన్ కార్లను వెనక్కు తెప్పించిన టెస్లా.. సాఫ్ట్‌వేరే కారణం..

by Dishafeatures2 |
1.1 మిలియన్ కార్లను వెనక్కు తెప్పించిన టెస్లా.. సాఫ్ట్‌వేరే కారణం..
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఈవీ కార్ల సంస్థ టెస్లా తాజాగా 1.1 మిలియన్ కార్లను వెనక్కు తెప్పించింది. ఆ కార్లలో ఉన్న విండో రివర్సింగ్ సాఫ్ట్‌వేర్ కారణంగానే టెస్లా యాజమాన్యం ఇలా చేయాల్సి వచ్చింది. తమ సంస్థ కార్లలో ఉన్న విండో రివర్సింగ్ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేసేందుకే యూఎస్‌లో టెస్లా ఇలా చేసింది. అయితే ప్రస్తుతం ఆ కార్లలో ఉన్న విండో రివర్సింట్ సాఫ్ట్‌వేర్ సరిగా పనిచేయడం లేదని, ఏదైనా అడ్డు తగిలిన ప్రతిసారి విండో వెనక్కు వెళ్లడం లేదని, తద్వారా వినియోగదారులకు గాయాలు అయ్యే అవకాశాలు పెరిగేందుకు ఛాన్స్ ఉందనే సంస్థ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుందన్న అధికారులు తెలిపారు.

అయితే ఈ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ఓవర్ ది ఎయిర్ అప్‌డేట్ ప్రాసెస్ అని, ఈ రీకాల్‌ ప్రక్రియలో 2017-2022లో మార్కెట్‌లోకి వచ్చిన మోడల్ 3, 2020-2021 సంవత్సరంలోని మోడల్ వై, 2021-2022 సంవత్సరంలో వచ్చిన మోడల్ ఎస్, మోడల్ ఎక్స్ కార్లకు కవర్ చేస్తుందని అధికారులు తెలిపారు. ఈ అప్‌డేట్ ద్వారా యూజర్ సేఫ్టీ పెరుగుతుందని, కార్ విండో రివర్సల్ మరింత స్మూత్‌గా ఉంటుందని వారు చెప్పుకొచ్చారు.


Next Story

Most Viewed