ఉద్యోగులకు షాక్ ఇచ్చిన DELL.. 6,650 మంది తొలగింపు!

by Disha Web Desk 17 |
ఉద్యోగులకు షాక్ ఇచ్చిన DELL.. 6,650 మంది తొలగింపు!
X

న్యూఢిల్లీ: గ్లోబల్ టెక్ దిగ్గజం డెల్ భారీ సంఖ్యలో ఉద్యోగాలను తొలగించింది. కరోనా మహమ్మారి సమయంలో దాదాపు అన్ని కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ కల్పించడం, పాఠశాల, కాలేజీల్లో ఆన్‌లైన్ పాఠాల కారణంగా పర్సనల్ కంప్యూటర్ల డిమాండ్ భారీగా పెరిగింది. ఆ సమయంలో దానికి అనుగుణంగా పీసీ తయారీ కంపెనీలు ఉత్పత్తిని పెంచాయి. దానికోసం పెద్ద ఎత్తున ఉద్యోగులను నియమించుకున్నాయి.

కానీ కరోనా తగ్గిపోవడంతో ఒక్కసారిగా పరిస్థితులు తలకిందులయ్యాయి. ఈ నేపథ్యంలో అన్ని టెక్ కంపెనీల తరహాలోనే పీసీ తయారీ కంపెనీలు ఖర్చు తగ్గింపు చర్యలను డెల్ చేపట్టింది. తాజా వివరాల ప్రకారం తాజా మొత్తం ఉద్యోగుల్లోని 5 శాతానికి సమానమైన 6,650 మందిని ఇంటికి సాగనంపాలని కంపెనీ నిర్ణయించింది. ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కంపెనీ ప్రతినిధి తెలిపారు.

కాగా, ప్రముఖ మార్కెట్ పరిశోధన సంస్థ ఐడీసీ గతేడాది డిసెంబర్ నాటికి పీసీ అమ్మకాల్లో భారీ క్షీణత నమోదైనట్టు వెల్లడించింది. అందులో డెల్ అమ్మకాలు గతేడాది కంటే 37 శాతం పడిపోయినట్టు ఐడీసీ తెలిపింది. కంపెనీ మొత్తం ఆదాయంలో 55 శాతం వాటా కలిగిన పీసీ విభాగం కారణంగా వ్యయ నియంత్రణ తప్పనిసరి అని డెల్ భావించింది. ఈ క్రమంలోనే ఆరు వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించింది.


Next Story

Most Viewed