ఫ్రెషర్ల నియామకాలు ప్రారంభించిన టీసీఎస్

by Dishanational1 |
ఫ్రెషర్ల నియామకాలు ప్రారంభించిన టీసీఎస్
X

దిశ, బిజినెస్ బ్యూరో: గత కొంతకాలంగా టెక్ రంగంలో లేఆఫ్స్ మాటే గానీ కొత్తవారి నియామకాల ఊసే లేకుండా పోయింది. డిమాండ్ లేకపోవడంతో చాలా ఐటీ కంపెనీలు నియామక ప్రక్రియలను నిలిపేశాయి. ఈ నేపథ్యంలో దేశీయ ఐటీ సేవల దిగ్గజం టీసీఎస్ నియామకాలు చేపడుతున్నట్టు ప్రకటించింది. సంస్థలోని మూడు విభాగాల్లో ఫ్రెషర్లను తీసుకునే ప్రక్రియను టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) ప్రారంభించింది. మనీకంట్రోల్ నివేదిక ప్రకారం, ఏప్రిల్ 10 చివరి తేదీగా టీసీఎస్ దరఖాస్తులను ఆహ్వానించింది. పరీక్షలు ఏప్రిల్ 26న జరగనున్నాయి. 2024కి చెందిన బీటెక్, బీఈ, ఎంసీఏ, ఎంఎస్సీ, ఎంఎస్ బ్యాచ్‌ల నుంచి దరఖాస్తుదారులను కంపెనీ పిలిచింది. ప్రధానంగా కంపెనీ నింజా, డిజిటల్, ప్రైమ్ అనే మూడు విభాగాల కోసం నియామకాలు చేపడుతోంది. నింజా విభాగంలోని ఉద్యోగులకు రూ. 3.36 లక్షల ప్యాకేజీ, డిజిటల్ విభాగం వారికి రూ. 7 లక్షలు, ప్రైమ్ విభాగంలో నియమించే వారికి రూ. 9-11 లక్షల ప్యాకేజీ ఆఫర్ చేస్తున్నట్టు సమాచారం. అయితే, ఎన్ని ఉద్యోగాలను నియమించనున్నదనే అంశంపై ఇంకా స్పష్టత లేదు. ఈ ఏడాది జనవరిలో కంపెనీ 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఫ్రెషర్ల రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ప్రారంభమైందని ప్రకటించింది. అందుకోసం క్యాంపస్‌లను సందర్శిస్తున్నట్టు పేర్కొంది.

Next Story

Most Viewed