వాహనాల ధరలు పెంచిన టాటా మోటార్స్!

by Harish |
వాహనాల ధరలు పెంచిన టాటా మోటార్స్!
X

న్యూఢిల్లీ: దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ తన కమర్షియల్ వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్న ఈ పెంపు 3 శాతం వరకు ఉంటుందని కంపెనీ తెలిపింది. కంపెనీ పోర్ట్‌ఫోలియోలోని అన్ని కమర్షియల్ వాహనాలకు ఇది వర్తిస్తుంది. వాహనాల తయారీలో కీలకమైన ఇన్‌పుట్ ఖర్చుల భారాన్ని భర్తీ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని టాటా మోటార్స్ అధికారిక ప్రకటనలో వెల్లడించింది.

దీంతో కంపెనీ ఈ ఏడాదిలో మూడోసారి పెంపు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇదివరకు వాహనాల్లో కొత్త ఉద్గార నిబంధనలు పాటించేందుకు జనవరిలో 1.2 శాతం, మార్చిలో 5 శాతం మేర ధరలను పెంచింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి దేశీయంగా బీఎస్6 రెండో దశ ఉద్గార నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఇది వాహన తయారీదారుల ఉత్పత్తిలో ఖర్చుల పెరుగుదలకు దారితీసింది.



Next Story