త్వరలో దేశీయంగా సెమీకండక్టర్ల తయారీ: టాటా సన్స్ ఛైర్మన్!

by Disha Web Desk 17 |
త్వరలో దేశీయంగా సెమీకండక్టర్ల తయారీ: టాటా సన్స్ ఛైర్మన్!
X

న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద సంస్థ టాటా గ్రూప్ రానున్న కొన్నేళ్లలో భారత్‌లో సెమీకండక్టర్ల తయారీని ప్రారంభిస్తుందని టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. చిప్‌ల ఉత్పత్తి ద్వారా ప్రపంచానికి భారత్ కీలక సరఫరాదారుగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. టాటా గ్రూప్ ఇప్పటికే టాటా ఎలక్ట్రానిక్స్‌ను ఏర్పాటు చేసిందని, దీని కింద సెమీకండక్టర్ అసెంబ్లీ టెస్టింగ్ బిజినెస్‌ను ఏర్పాటు చేయనున్నామని, ఈ ప్రాజెక్టులో యూఎస్, జపాన్, తైవాన్, దక్షిణ కొరియా దేశాలు భాగస్వాములుగా ఉంటాయన్నారు.

వచ్చే ఐదేళ్ల కాలంలో ఈ విభాగంలో సుమారు రూ. 7.40 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టాలని ప్రణాళిక కలిగి ఉన్నట్లు చంద్రశేఖరన్ చెప్పారు. సెమీకండక్టర్లతో పాటు ఈవీ, ఈవీ బ్యాటరీల తయారీ, పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి, కిరాణా సహా వివిధ ఉత్పత్తులు, వస్తువులు, సేవలు, సూపర్ యాప్ వంటి కొత్త తరం వ్యాపారాల్లో ప్రవేశించనున్నామని ఆయన వివరించారు.


Next Story

Most Viewed