రాజేష్ గోపీనాథన్ టాటా గ్రూప్‌లో అడ్వైజరీగా కొనసాగేందుకు చర్చలు!

by Disha Web Desk 17 |
రాజేష్ గోపీనాథన్ టాటా గ్రూప్‌లో అడ్వైజరీగా కొనసాగేందుకు చర్చలు!
X

న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టీసీఎస్ సీఈఓ, ఎండీగా రాజీనామా చేస్తున్నట్టు రాజేష్ గోపీనాథన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 15 వరకు రాజేష్ గోపీనాథన్ సీఈఓగా ఉంటారు. అయితే, గడువు తర్వాత కూడా ఆయన టీసీఎస్‌తో కొనసాగేందుకు టాటా ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ సమావేశమైనట్లు తెలుస్తోంది. టాటా సన్స్ గ్రూప్ అడ్వైజర్‌గా ఉండేందుకు ఇద్దరూ చర్చించారని, వివిధ రంగాల్లో ఉన్న టాటా గ్రూప్ వ్యాపారాల వృద్ధికి విశ్వసనీయమైన, అనుభవజ్ఞులైన వారు కావాలి కాబట్టి ఈ చర్చలు జరిపినట్లు సంబంధిత వర్గాలు చెప్పాయని పీటీఐ తెలిపింది.

అయితే, దీనిపై టాటా గ్రూప్, టీసీఎస్ సంస్థలు అధికారికంగా స్పందించలేదు. ఈ చర్చ ప్రాథమిక దశలోనే ఉన్నందున, దానిపై స్పష్టత వచ్చిన అనంతరం ప్రకటించవచ్చని తెలుస్తోంది. ఇక, టీసీఎస్‌లో చంద్రశేఖరన్, రాజేష్ గోపీనాథన్‌లది సుమారు పాతికేళ్ల స్నేహం. ఒకప్పుడు సంస్థ వృద్ధిలో ఇద్దరి భాగస్వామ్యం పై ప్రశంసలు కూడా వచ్చాయి.

Next Story