లే ఆఫ్స్‌ వేళ భారీగా జీతం అందుకున్న సుందర్ పిచాయ్

by Disha Web Desk 17 |
లే ఆఫ్స్‌ వేళ భారీగా జీతం అందుకున్న సుందర్ పిచాయ్
X

కాలిఫోర్నియా: గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ 2022 ఏడాదికి గాను భారీగా జీతం అందుకున్నారు. కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో దాఖలు చేసిన వివరాల ప్రకారం, సుందర్ పిచాయ్ 2022 ఏడాదికి సుమారు భారత కరెన్సీ ప్రకారం రూ. 1850 కోట్లకు(226 మిలియన్ డాలర్లు) పైగా జీతాన్ని అందుకున్నారు. దీంట్లో 218 మిలియన్ డాలర్లు మొత్తం కూడా మూడు సంవత్సరాల కాలానికి స్టాక్ అవార్డులుగా అందుకున్నారు. గత మూడేళ్లుగా ఆయన జీతం 2 మిలియన్ డాలర్ల వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ఇంతకుముందు 2019 ఏడాదిలో పిచాయ్ జీతం దాదాపుగా 281 మిలియన్ డాలర్ల వద్ద ఉంది.

ఆర్థిక మాంద్యం ప్రభావంతో కంపెనీ గత కొద్ది నెలలుగా వరుసగా ఉద్యోగులను తొలగిస్తున్న తరుణంలో సుందర్ పిచాయ్ భారీ మొత్తంలో భారీతోషకం తీసుకోవడం, అలాగే స‌గటు ఉద్యోగికి, సీఈవోకు మ‌ధ్య జీతంలో భారీ వ్యత్యాసం ఉండటం ఉద్యోగుల వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటకే లే ఆఫ్స్‌కు వ్యతిరేకంగా ఉద్యోగులు నిరసనలు కూడా చేపట్టారు. కొంతమంది కంపెనీ సీఈవోకు సంతకాలతో కూడిన లెటర్‌ను కూడ రాసారు.

ఇంతకుముందు జనవరిలో 12,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది, ఇది ప్రపంచవ్యాప్తంగా సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో 6 శాతానికి పైగా సమానం. ఖర్చులను తగ్గించడానికి, మాంద్యం ప్రభావాన్ని ఎదుర్కొడానికి, కొత్త ప్రాజెక్టుల ప్రణాళికల్లో భాగంగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.


Next Story

Most Viewed