దేశంలోని 6 లక్షల మంది డేటా విక్రయం!

by Disha Web Desk 17 |
దేశంలోని 6 లక్షల మంది డేటా విక్రయం!
X

న్యూఢిల్లీ: టెక్నాలజీ వినియోగం పెరుగుతున్న స్థాయిలోనే సైబర్ మోసాలు కూడా నమోదవుతున్నాయి. ప్రముఖ వీపీఎన్‌ సర్వీస్‌ ప్రొవైడర్ కంపెనీ నార్డ్ వీపీఎన్ తాజా నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 50 లక్షల మంది వ్యక్తులకు చెందిన డేటా చోరీ అవ్వడమే కాకుండా, ఈ మొత్తం డేటాను బాట్ మార్కెట్లో విక్రయించారు. అందులో అత్యధికంగా భారత్‌కు చెందిన 6 లక్షల మంది వివరాలు ఉన్నాయని నార్డ్ వీపీఎన్ వెల్లడించింది.

గత నాలుగేళ్ల నుంచి బాట్ మార్కెట్లో అమ్మకానికి ఉన్న వివరాలను పరిశీలించిన అనంతరం ఈ నివేదిక రూపొందించినట్టు నార్డ్ వీపీఎన్ తెలిపింది. బాట్ మాల్వేర్‌ ద్వారా వ్యక్తులు వాడే డివైజ్ నుంచి దొంగిలించబడిన డేటాను విక్రయించేందుకు బాట్ మార్కెట్‌లను హ్యాకర్లు ఉపయోగిస్తారు. ఇందులో వ్యక్తుల లాగ్-ఇన్ వివరాలు, డిజిటల్ ఫింగర్ ప్రింట్స్, స్క్రీన్‌షాట్స్ సహా పలు వ్యక్తిగత వివరాలుంటాయి. అలా ఒక్కో వ్యక్తికి చెందిన డేటాను సగటున రూ. 490 కి విక్రయిస్తున్నారని నివేదిక పేర్కొంది.

విక్రయించిన మొత్తం డేటాలో ఫేస్‌బుక్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సోషల్ మీడియా సైట్‌ల లాగ్-ఇన్ వివరాలు కూడా ఉన్నాయని నివేదిక స్పష్టం చేసింది.


Next Story

Most Viewed