భారత వృద్ధి రేటును తగ్గించిన గ్లోబల్ రేటింగ్స్!

by Disha Web Desk 17 |
భారత వృద్ధి రేటును తగ్గించిన గ్లోబల్ రేటింగ్స్!
X

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి అంచనాను 7.3 శాతానికి తగ్గిస్తున్నట్టు ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఎస్అండ్‌పీ గ్లోబల్ రేటింగ్స్ వెల్లడించింది. అదేవిధంగా వచ్చే ఏడాది వృద్ధి 6.5 శాతంగా ఉంటుందని తెలిపింది. మరోవైపు ఈ ఏడాది చివరి వరకు దేశంలో ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ నిర్దేశించిన లక్ష్యం 6 శాతం కంటే ఎక్కువగానే ఉంటుందని అభిప్రాయపడింది. ద్రవ్యోల్బణం ఈ ఏడాదిలో సగటున 6.8 శాతం ఉండొచ్చని పేర్కొంది.

సోమవారం ఎస్అండ్‌పీ గ్లోబల్ విడుదల చేసిన 'ఎకనమిక్ ఔట్‌లుక్ ఫర్ ఏషియా పసిఫిక్' నివేదిక ప్రకారం, కొవిడ్-19 మహమ్మారి నుంచి నెమ్మదిగా బయటపడుతున్న భారత ఆర్థిక వ్యవస్థకు 2023లో దేశీయ వినియోగం కీలక మద్దతుగా నిలుస్తుందని తెలిపింది. చైనాలో కొనసాగుతున్న మందగమన పరిస్థితుల మధ్య భారత్‌లో సేవల వినియోగం పెరగడం, పెట్టుబడులు ఎక్కువగా రావడం వల్ల వృద్ధికి కలిసొచ్చిందని ఎస్అండ్‌పీ గ్లోబల్ రేటింగ్స్ ఆసియా-పసిఫిక్ చీఫ్ ఎకనమిస్ట్ లూయిస్ కూయిజ్ అన్నారు.

దేశంలో కొనసాగుతున్న అధిక ద్రవ్యోల్బణం, వరుస సమావేశాల్లో వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాల ఆధారంగా ఇప్పటికే పలు ఆర్థిక సంస్థలు భారత వృద్ధి రేటును తగ్గించిన సంగతి తెలిసిందే. ఇందులో ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ 7.5 శాతం నుంచి 7 శాతానికి, ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ 7 శాతం నుంచి 6.9 శాతానికి, ఫిచ్ రేటింగ్స్ 7.8 శాతం నుంచి 7 శాతానికి సవరించాయి.



Next Story

Most Viewed