ఎస్‌వీబీ పతనం భారత బ్యాంకింగ్ వ్యవస్థను ప్రభావితం చేయదు: నిపుణులు!

by Disha Web Desk 13 |
ఎస్‌వీబీ పతనం భారత బ్యాంకింగ్ వ్యవస్థను ప్రభావితం చేయదు: నిపుణులు!
X

న్యూఢిల్లీ: బ్యాంకింగ్‌ షేర్ల పతనానికి కారణమవుతున్న సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌(ఎస్‌వీబీ) వ్యవహారంపై దేశీయ నిపుణులు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎస్‌వీబీ పతనం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఒత్తిడి నెలకొన్న నేపథ్యంలో భారత బ్యాంకింగ్ వ్యవస్థపై పెద్దగా ప్రభావితమయ్యే అవకాశం లేదని స్పష్టం చేస్తున్నారు. భారత బ్యాంకింగ్ వ్యవస్థ సమర్థవంతంగా ఉంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) పర్యవేక్షణలో నియంత్రించబడుతున్నది కాబట్టి ఎస్‌వీబీ పతనం దేశీయ బ్యాంకులపై ఎలాంటి ఇబ్బంది కలిగించదని వెల్త్‌మిల్స్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజిస్ట్ క్రాంతి బత్తిని అన్నారు.

అయితే, స్టాక్ మార్కెట్లలో మదుపర్ల సెంటిమెంట్‌పై కొంతమేర ప్రభావం ఉంటుంది. మార్కెట్లకు సంబంధించి తాత్కాలికంగా సెంటిమెంట్‌ను దెబ్బతీసినప్పటికీ దీర్ఘకాలంలో ఏమంత ఒత్తిడి ఉండదని ఆయన తెలిపారు. దేశ బ్యాంకింగ్ వ్యవస్థ స్వాభావికంగా బలంగా ఉన్నది. సిలికాన్ వ్యాలీ సంక్షోభాన్ని అధిగమిస్తుందని, కొంతాలం భారత స్టార్టప్‌లు నిధుల కొరతను మాత్రమే ఎదుర్కోవాల్సి తప్పించి, ఎక్కువ ప్రభావం ఉండదని ఈక్వైర్స్ కన్స్యూమర్ అండ్ హెల్త్‌కేర్ బ్యాంకింగ్ ఎండీ భవేష్ షా చెప్పారు.

ఇవి కూడా చదవండి : భారత ఈక్విటీల్లోకి మళ్లీ ఎఫ్‌పీఐ పెట్టుబడులు!

Next Story

Most Viewed