- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
'హునర్ ఆన్‌లైన్‌కోర్స్' ప్లాట్‌ఫామ్‌కు అంబాసిడర్‌గా శిల్పాశెట్టి!
హైదరాబాద్: ప్రముఖ బాలీవుడ్ నటి, పారిశ్రామికవేత్త శిల్పాశెట్టి హైదరాబాద్‌కు చెందిన హునర్ ఆన్‌లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్‌లో పెట్టుబడి పెట్టారు. ఈ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ మహిళలకు ఫ్యాషన్, ఫుడ్, ఫొటోగ్రఫీ, ఇంటీరియర్ డిజైన్ వంటి కోర్సులను నేర్పించడమే కాకుండా ఆర్థికంగా స్వతంత్రంగా ఎదిగేందుకు సహాయపడుతుంది. హునర్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా శిల్పాశెట్టి వ్యవహరించనున్నారని కంపెనీ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది.
'దేశంలోని మహిళలు ఆర్థిక స్వాతంత్య్రం పొందే నైపుణ్యాన్ని అందించడమనేది నా కల. మహిళలందరికీ ఆర్థిక స్వాతంత్య్రం, వ్యక్తిగత ఆదాయ వనరులు ముఖ్యమని నమ్ముతాను. దీనికి సంబంధించి హునర్ ఆన్‌లైన్ కోర్స్ ప్లాట్‌ఫామ్ మెరుగైన సేవలందిస్తోంది. అందుకే ఇందులో పెట్టుబడి పెట్టాలని, బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు ' శిల్పాశెట్టి చెప్పారు.
మహిళలు ఆర్థికంగా స్వతంత్రంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. కానీ వారికి సరైన లెర్నింగ్, అవకాశాలు ఉండటం లేదు. ఈ సమస్యను అధిగమించేందుకే హూనర్ ప్రయత్నిస్తుంది. మహిళలకు అన్ని రకాలుగా ప్రోత్సాహకాలు అందిస్తామని హునర్ ఆన్‌లైన్ కోర్స్ వ్యవస్థాపకురాలు, సీఈఓ నిష్టా యోగేశ్ అన్నారు.
హునర్ కంపెనీ మహిళలకు ఫ్యాబ్రిక్ డిజైనింగ్, గార్మెంట్ మేకింగ్, బ్యాగ్ మేకింగ్, హోమ్ డెకర్, జ్యువెలరీ డిజైనింగ్, బేకింగ్, చాక్లెట్ మేకింగ్, మేకప్ కోర్సులు, బొటిక్ మేనేజ్‌మెంట్, ఫ్యాషన్ ఆంత్రప్రెన్యూర్‌షిప్ వంటి కోర్సులను అందిస్తోంది.