ఒడిదుడుకుల మధ్య తక్కువ లాభాలతో సరిపెట్టిన సూచీలు

by Dishanational1 |
ఒడిదుడుకుల మధ్య తక్కువ లాభాలతో సరిపెట్టిన సూచీలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లు భారీ నష్టాలను ఎదుర్కొన్న తర్వాత ఒడిదుడుకుల మధ్యే ర్యాలీ చేశాయి. బుధవారం ట్రేడింగ్‌లో ఉదయం నష్టాల్లో పారంభమైన సూచీలు రోజంతా అస్థిరంగానే కదలాడాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలకు ఉన్నప్పటికీ దేశీయంగా పటిష్టమైన ప్రత్యక్ష పన్ను వసూళ్ల కారణంగా రాణించాయి. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించడంలో చివర్లో స్టాక్ మార్కెట్లు నీరసించడంతో స్వల్ప లాభాలతో సరిపెట్టాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 89.64 పాయింట్లు పెరిగి 72,101 వద్ద, నిఫ్టీ 21.65 పాయింట్ల లాభంతో 21,839 వద్ద ముగిశాయి. నిఫ్టీలో బ్యాంకింగ్, మెటల్, ఫార్మా రంగాలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో మారుతీ సుజుకి, పవర్‌గ్రిడ్, నెస్లె ఇండియా, ఎస్‌బీఐ, ఐటీసీ, రిలయన్స్ లాభాలను సాధించాయి. టాటా స్టీల్, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హిందూస్తాన్ యూనిలీవర్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.04వద్ద ఉంది.


Next Story

Most Viewed