భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

by S Gopi |
భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: రికార్డు స్థాయి ర్యాలీ కొనసాగిస్తున్న దేశీయ ఈక్విటీ మార్కెట్లకు నష్టాలు ఎదురయ్యాయి. గత కొన్ని సెషన్‌లలో కొత్త గరిష్ఠాలను తాకుతున్న సూచీలు బుధవరం భారీగా నష్టపోయాయి. ఉదయం సానుకూలంగా ట్రేడింగ్ మొదలవడంతో సెన్సెక్స్ ఇండెక్స్ ఓ దశలో 80,481 వద్ద కొత్త గరిష్టాలను తాకింది. అనంతరం మిడ్-సెషన్‌కు ముందు ఏకంగా 900 పాయింట్ల వరకు కుదేలయ్యాయి. ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మద్దతు లేకపోవడం, దేశీయంగా ఆల్‌టైమ్ హై స్థాయిల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడం, కీలక ఐటీ రంగం షేర్లలో అమ్మకాల ఒత్తిడి కారణంగా స్టాక్ మార్కెట్లు క్షీణించాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 426.87 పాయింట్లు పతనమై 79,924 వద్ద, నిఫ్టీ 108.75 పాయింట్లు నష్టపోయి 24,324 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఆటో, మెటల్, మీడియా, పీఎస్‌యూ బ్యాంక్ రంగాలు దెబ్బతిన్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఏషియన్ పెయింట్, పవర్‌గ్రిడ్, ఎన్‌టీపీసీ, హిందూస్తాన్ యూనిలీవర్, సన్‌ఫార్మా, అదానీ పోర్ట్స్ లాభాలను దక్కించుకున్నాయి. ఎంఅండ్ఎం, టాటా స్టీల్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, ఎస్‌బీఐ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.51 వద్ద ఉంది.

Advertisement

Next Story

Most Viewed