- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు ఈవారం నష్టాలతో మొదలయ్యాయి. సోమవారం ఉదయం నష్టాలతోనే మొదలైన సూచీలు ఆ తర్వాత కొద్దిసేపు లాభాల్లో కదలాడాయి. కానీ, మిడ్-సెషన్ అనంతరం అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మద్దతు లేకపోవడం, ఆసియా మార్కెట్లలో మిశ్రమ ర్యాలీ, ముడి చమురు ధరలు పెరగడంతో పాటు దేశీయంగా రూపాయి బలహీనపడటం, కీలక రంగాల్లో అమ్మకాలు ట్రేడింగ్‌పై ప్రభావం చూపాయి.
దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 139.58 పాయింట్లు కోల్పోయి 65,655 వద్ద, నిఫ్టీ 37.80 పాయింట్లు నష్టపోయి 19,694 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఐటీ, హెల్త్‌కేర్ రంగాలు రాణించగా, ఆటో, ఎఫ్‌ఎంసీజీ, మెటల్ స్టాక్‌లలో అమ్మకాల ఒత్తిడి ఎక్కువగా ఉంది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌సీఎల్ టెక్, విప్రో, టెక్ మహీంద్రా, టీసీఎస్, మారుతీ సుజుకి, టైటాన్, కోటక్ బ్యాంక్ షేర్లు లాభాలను దక్కించుకున్నాయి.
బజాజ్ ఫైనాన్స్, ఎంఅండ్ఎం, అల్ట్రా సిమెంట్, బజాజ్ ఫిన్‌సర్వ్, టాటా మోటార్స్, హిందూస్తాన్ యూనిలీవర్, ఏషియన్ పెయింట్ కంపెనీల స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.35 వద్ద ఉంది.