తగిన శాస్తి జరిగిందంటున్న నెటిజన్లు.. PR సుందర్‌పై సెబీ యాక్షన్

by Disha Web Desk 17 |
తగిన శాస్తి జరిగిందంటున్న నెటిజన్లు.. PR సుందర్‌పై సెబీ యాక్షన్
X

ముంబై: మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) రిజిస్ట్రేషన్ లేకుండా పెట్టుబడి సలహాలు ఇస్తూ, భారీగా ఫీజులు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదుల కారణంగా ఫైనాన్షియల్ ఫిన్‌ఫ్లుయెన్సర్ పిఆర్ సుందర్‌పై సెబీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పెట్టుబడి సలహా ఇవ్వడానికి, సెబీ (ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్స్) రెగ్యులేషన్ 2013 ప్రకారం ఒక వ్యక్తి లేదా సంస్థ పెట్టుబడి సలహాదారుగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. కానీ పిఆర్ సుందర్ ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండా సలహాలు ఇస్తున్నారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో రూ. 6 కోట్ల జరిమానా చెల్లింపుతో పాటు, ఒక ఏడాది పాటు ఎలాంటి సెక్యూరిటీ లావాదేవీలు నిర్వహించకుండా సెబీ నిషేధం విధించింది.

ఈ వ్యవహరంలో పిఈర్ సుందర్, మార్కెట్ రెగ్యూలేటరీ (సెబీ)తో ఒక సెటిల్మెంట్‌కు వచ్చారు. దీని ప్రకారం, పిఆర్ సుందర్‌కు చెందినటువంటి మూడు కంపెనీలు పొందిన లాభాన్ని మొత్తం వడ్డీతో సహా తిరిగి చెల్లించేందుకు అంగీకరించాయి. మూడు కంపెనీలు ఒక్కోటి రూ. 15 లక్షలకు పైగా అమౌంట్‌ను 12 శాతం వడ్డీతో సహా మొత్తం రూ. 6 కోట్లకు పైగా చెల్లించనున్నాయి. దీని గురించి గతంలో పిఆర్ సుందర్, అతని కంపెనీ మన్సున్ కన్సల్టింగ్, కో-ప్రమోటర్ మంగయార్‌కరసికి సెబీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. తాజాగా ఇప్పుడు చర్యలు తీసుకుంది.

చెన్నైకి చెందిన ఇన్‌ఫ్లుయెన్సర్ పిఆర్ సుందర్ వెబ్‌సైట్‌‌ను నిర్వహిస్తున్నాడు. టెలిగ్రాం, వివిధ సోషల్ మీడియా సైట్ల ద్వారా ప్యాకేజీలతో పెట్టుబడులకు సంబంధించిన సలహాలు ఇస్తుంటారు. అయితే ఆయన తప్పుడు ట్రెడింగ్ కాల్స్ ఇస్తున్నారని, అలాగే దీనికి ఎలాంటి రిజిస్ట్రేషన్ లేదని, పైగా సలహాల కోసం భారీగా ఫీజులు వసూలు చేస్తారని పలువురు సెబీకి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తగిన శాస్తి జరిగిందని కామెంట్లు చేస్తున్నారు.



Next Story

Most Viewed