- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- ఎన్ఆర్ఐ - NRI
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
SBI Server Down: దేశవ్యాప్తంగా SBI సర్వర్లు డౌన్.. ఆగిపోయిన వేలాది కంపనీల జీతాలు..!
దిశ, వెబ్‌డెస్క్:దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ(public sector banking institution) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) సర్వర్(Server) ఈ రోజు ఉదయం నుంచి డౌన్ అయ్యింది. దీంతో దేశవ్యాప్తంగా SBI కస్టమర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.యూపీఐ లావాదేవీలు(UPI Transactions),నెట్ బ్యాంకింగ్(Net Banking)తో పాటు బ్యాంకు సేవల్లో కూడా అంతరాయం ఏర్పడినట్టు పలువురు కస్టమర్లు ఫిర్యాదు చేస్తున్నారు.సర్వర్ డౌన్ కారణంగా ఈ రోజు పబ్లిక్,ప్రైవేట్ కంపెనీలు ఉద్యోగులకు జీతాలు వేయలేక పోతున్నాయి.దీంతో జీతాలు పడక ఉద్యోగులు విలవిలలాడుతున్నారు.అలాగే డబ్బులు కట్ అయినా పేమెంట్స్ ఫెయిల్ అవుతున్నాయని సోషల్ మీడియాలో కొందరు పోస్టులు పెడుతున్నారు.కాగా నిన్న కూడా సర్వర్ డౌన్ కారణంగా కస్టమర్లు అనేక ఇబ్బందులు పడ్డారు.సర్వర్ డౌన్ తో కోట్లాది మంది ముప్పు తిప్పలు పడుతున్న ఎస్‌బీఐ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవరిస్తోంది. కాగా బ్యాంకు సేవల అంతరాయంపై ఎస్‌బీఐ ఉన్నతాధికారులు మాత్రం స్పందించలేదు. దీనిపై కస్టమర్లు సోషల్ మీడియా వేదికగా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.