- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆర్థిక మంత్రికి ₹8,813 కోట్ల చెక్కు అందజేసిన చైర్మన్ సిఎస్ శెట్టి!
ఆర్థిక సంవత్సరం 2025-26 కు గాను ఎస్‌బీఐ కేంద్ర ప్రభుత్వానికి ₹8,813 కోట్ల డివిడెండ్ చెల్లించింది. ఎస్‌బీఐ ఈ ఆర్థిక సంవత్సరంలో ₹80,032 కోట్ల రికార్డు నికర లాభాన్ని సాధించింది.

దిశ, వెబ్ డెస్క్: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కేంద్ర ప్రభుత్వానికి భారీ స్థాయిలో డివిడెండ్‌ను చెల్లించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి (FY26) గాను ₹8,813 కోట్ల డివిడెండ్ చెక్కును ఎస్‌బీఐ ఛైర్మన్ సిఎస్ శెట్టి.. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు అధికారికంగా అందజేశారు. బ్యాంక్ సాధించిన రికార్డు స్థాయి లాభాలు, స్థిరమైన వ్యాపార వృద్ధి కారణంగానే కేంద్రానికి ఈ స్థాయిలో భారీ లబ్ధి చేకూరినట్లు తెలుస్తుంది.
రికార్డు లాభాలతో దూసుకుపోతున్న ఎస్‌బీఐ..
మారిన ఆర్థిక సంస్కరణలు, రుణ వితరణలో వృద్ధి, తక్కువ నిరర్థక ఆస్తుల (NPA) కారణంగా ఎస్‌బీఐ లాభాల బాటలో దూసుకుపోతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో (FY26) ఈ బ్యాంక్ ఏకంగా ₹80,032 కోట్ల నికర లాభాన్ని (Net Profit) నమోదు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. గతేడాది సాధించిన లాభాలతో పోలిస్తే ఇది 12.88 శాతం వృద్ధిని కనబర్చడం విశేషం. కేవలం జనవరి-మార్చి (క్యూ4) చివరి త్రైమాసికంలోనే బ్యాంక్ ₹19,684 కోట్ల నికర ఆదాయాన్ని ఆర్జించి తన ఆర్థిక పటిష్టతను చాటుకున్నట్లు ఎస్బీఐ అధికారులు వెల్లడించారు.






