ఆర్డర్ చేసిన 10 నిమిషాల్లో శాంసంగ్ గెలాక్సీ ఎస్24 డెలివరీ

by Dishanational1 |
ఆర్డర్ చేసిన 10 నిమిషాల్లో శాంసంగ్ గెలాక్సీ ఎస్24 డెలివరీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ శాంసంగ్ తన కొత్త మొబైల్ సిరీస్ గెలాక్సీ ఎస్24 విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఎస్24 మొబైల్ కొనే వినియోగదారుల కోసం ప్రముఖ క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ బ్లింక్ఇట్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ మేరకు శాంసంగ్ గురువారం ప్రకటనలో వెల్లడించింది. ఈ భాగస్వామ్యంలో భాగంగా కంపెనీ తన ఎస్24 సిరీస్ మొబైల్ డెలివరీలను బ్లింక్ఇట్ ద్వారా కేవలం 10 నిమిషాల్లో అందించనున్నట్టు తెలిపింది. ప్రస్తుతానికి ఢిల్లీ-ఎన్‌సీఆర్, బెంగళూరు, ముంబైలలోని కస్టమర్లకు ఈ అవకాశం ఉంటుందని పేర్కొంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ఆల్ట్రా, గెలాక్సీ ఎస్24 ప్లస్, గెలాక్సీ ఎస్24 స్మార్ట్‌ఫోన్‌లను బ్లింక్ఇట్‌లో ఆర్డర్ చేస్తే 10 నిమిషాల కంటే తక్కువ సమయంలో డెలివరీ చేయనున్నట్టు అధికారిక ప్రకటనలో వెల్లడించింది. వేగవంతమైన డెలివరీ మాత్రమే కాకుండా ఈ భాగస్వామ్యం వల్ల బ్లింక్ఇట్‌లో గెలాక్సీ ఎస్24 సిరీస్ కొనే కస్టమర్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డుపైన రూ. 5,000 తక్షణ క్యాష్‌బ్యాక్ పొందవచ్చని తెలిపింది. ఇప్పటికే గెలాక్సీ ఎస్24 సిరీస్ కోసం రికార్డు స్థాయిలో ప్రీ-బుకింగ్‌లు వచ్చాయి. ఈ నెల 18 నుంచి మూడు రోజుల వ్యవధిలో దేశీయంగా 2.5 లక్షల కంటే ఎక్కువ మంది కస్టమర్లు ప్రీ-బుకింగ్ చేశారని శాంసంగ్ ఓ ప్రకటనలో పేర్కొంది.

Next Story

Most Viewed