- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- ఎన్ఆర్ఐ - NRI
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
Samsung: శాంసంగ్ ఎస్24 సిరీస్ ఫోన్ల యూజర్లకు బిగ్ షాక్..కేవలం ఏడాది పాటు మాత్రమే ఏఐ ఫీచర్లు ఫ్రీ..!
దిశ, వెబ్‌డెస్క్:గత కొన్ని నెలలుగా ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) సేవలు పెరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో ఫోన్ల తయారీ సంస్థలు కూడా తమ కొత్త ఫోన్లలో ఏఐ ఫీచర్లు(AI features) ప్రవేశ పెడుతున్నాయి.ఇదిలా ఉంటే సౌత్ కొరియా(South Korea) ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్(Samsung) తమ మొబైల్ వినియోగదారులకు షాకింగ్ వార్త చెప్పింది.శాంసంగ్ గెలాక్సీ ఎస్24(Galaxy S24), గెలాక్సీ ఎస్24 ఎఫ్ఈ(Galaxy S24 SE) ఫోన్లలో ఏఐ ఫీచర్లు వచ్చే ఏడాది వరకూ మాత్రమే ఫ్రీగా అందిస్తామని తెలిపింది.2025 చివరి నుంచి ఏఐ ఫీచర్లు పొందాలంటే ఎస్24 సిరీస్ ఫోన్ల యూజర్లు ఫీజు(Fee) చెల్లించాల్సి ఉంటుందని ప్రకటించింది.ఈ ప్రకటనతో ఎస్24 మొబైల్ వినియోగదారులు శాంసంగ్ పై ఫైర్ అవుతున్నారు.
అయితే శాంసంగ్ తీసుకొచ్చిన ఏఐ ఫీచర్లలో ఈజీగా నావిగేషన్ చేయొచ్చు. అంతేకాదు మాట్లాడే కాల్స్ వాయిస్ ట్రాన్స్ లేట్ అవకాశాన్ని కూడా పొందొచ్చు. గూగుల్ మ్యాజిక్ ఎడిటర్ లాగా, Galaxy AI ఫోటో సాయంతో మీరు వస్తువులను తొలగించడానికి లేదా మార్చుకునే ఆప్షన్ ఉంటుంది.వీటితోపాటు సర్కిల్ టూ సెర్చ్, పీడీఎఫ్ టెక్ట్స్ ట్రాన్స్ లేట్ తదితర ఫీచర్లు ఎస్24 సిరీస్ ఫోన్లలో ఉన్నాయి.మరి వీటిలో ఏ ఫీచర్లకు ఫీజు వసూలు చేస్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.