రాబోయే అకాడమిక్ కోసం విద్యార్థులకు స్కాలర్షిప్ అందిస్తోన్న ఆర్వి విశ్వవిద్యాలయము

by Disha Web Desk 17 |
రాబోయే అకాడమిక్ కోసం విద్యార్థులకు స్కాలర్షిప్ అందిస్తోన్న ఆర్వి విశ్వవిద్యాలయము
X

దిశ, వెబ్‌డెస్క్: ఆర్వి విశ్వవిద్యాలయము(ఆర్వియు), లిబరల్ విద్యకు ఉద్దేశించబడిన భారతదేశపు కొత్త-యుగపు, టెక్-డ్రివెన్ ప్రపంచ వ్యాప్త విశ్వవిద్యాలయము, 2023 ఆగస్టులో మొదలయ్యే రాబోయే అకాడమిక్ సంవత్సరంకి మెరిట్ స్కాలర్షిప్స్ కొరకు రూ. 10 కోట్లు కేటాయించింది. ఇది 500+ అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ప్రోగ్రాముల విద్యార్థులకు లబ్ధిని చేకూరుస్తుంది.

స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌లో ఇంచుమించు 200 మంది బి.టెక్. విద్యార్థులు, 50 బి.ఎస్సీ. విద్యార్థులు ఈ స్కాలర్షిప్ నుంచి లాభం పొందుతారు, అలాగే స్కూల్ ఆఫ్ లా లోని అయిదు-సంవత్సరాల బి.ఎ.ఎల్ ఎల్ బి, బి.బి.ఎ.ఎల్ ఎల్ బి. చదివే 75 విద్యార్థులు, ఎల్ ఎల్.ఎం. ప్రోగ్రాములలోని వారు కూడా లబ్ధి పొందుతారు. స్కూల్ ఆఫ్ లిబరల్ ఆర్ట్స్ ఎండ్ సైన్స్, స్కూల్ ఆఫ్ డిజైన్ అండ్ ఇన్నోవేషన్ నుంచి – అంటే ప్రతి స్కూల్ నుంచి 40 విద్యార్ధులను కవర్ చేస్తాయి ఈ స్కాలర్షిప్స్. స్కూల్ ఆఫ్ బిజినెస్, స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి బి.బి.ఎ, బి.కాం, బి.ఎ. (ఎకనామిక్స్) ప్రోగ్రాముల విద్యార్ధులకు 80 మెరిట్ స్కాలర్షిప్స్ ప్రపోజ్ చెయ్యబడ్డాయి.

బెంగళూరు-ఆధారముగా వున్న ఆర్వియు ఈ స్కాలర్షిప్సుని విశిష్టమైన మెరిట్ కలిగిన విద్యార్థులకు వారి విద్యా ఆశయాలు పొందేలా చెయ్యడానికి, భవిష్యత్తు లీడర్ల టాలెంట్-పూలుని సృష్టించడం కొరకు అందిస్తోంది. వీటిలో మొదటి సంవత్సరం చదువుకి 100%, 50%, 25% స్కాలర్షిప్స్ ఇవ్వబడ్డాయి. ఈ స్కాలర్షిప్స్ రెన్యువల్ మెరిట్‌ని మెయింటేన్ చేసుకునే దాని మీద ఆధారపడి ఉంటుంది. 2023-2024 సంవత్సరాల అడ్మిషన్లు తెరిచి ఉన్నాయి కాబట్టి, ఈ సంవత్సరపు స్కాలర్షిప్స్ కొరకు విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు.

2021లో ప్రారంభమైన మొదటి సంవత్సరంలో ఆర్వియు 100 స్కాలర్షిప్స్ అందించింది, ఇందులో కొవిడ్ సమయంలో ఒకరిని లేక తల్లిదండ్రులు ఇద్దరినీ పోగొట్టుకున్న విద్యార్థులకు ఇచ్చిన 100% స్కాలర్షిప్స్ కూడా వున్నాయి. 2022 వ సంవత్సరములో, ఇంచుమించు 200 విద్యార్ధులకు రూ. 3 కోట్ల విలువగల స్కాలర్షిప్స్ ఇచ్చారు. విశ్వవిద్యాలయము క్రమము తప్పకుండా స్కాలర్షిప్ కార్పస్ ఫండ్‌ని పెంచుతోంది. ఈ ఫండ్ విశిష్టమైన మెరిట్ కలిగిన విద్యార్థుల కొరకు, సమాజములోని ఆర్ధికముగా బలహీన వర్గాలకు చెందిన విద్యార్థుల కొరకు ఉద్దేశించబడింది. దీని కోసం https://admissions.rvu.edu.in/ వద్ద విద్యార్ధులు రిజిస్టర్ చేసుకోవచ్చు. అడ్మిషన్స్ టీంని కాంటాక్ట్ చెయ్యటం ద్వారా ఈ ప్రక్రియ గురించి అధికముగా తెలుసుకోవచ్చు.

ప్రొఫెసర్ వై.ఎస్.ఆర్. మూర్తి, వైస్-ఛాన్సలర్, ఆర్వి విశ్వవిద్యాలయము, బెంగళూరు ఇలా అన్నారు, "మేము అర్హత ఉన్న విద్యార్థులకు ఈ మెరిట్ స్కాలర్షిప్స్ ప్రకటించడానికి అనందిస్తున్నాము. 2021 నుంచి మా మిషన్‌లో మౌలిక భాగంగా అకాడమిక్ శ్రేష్ఠత వుంది. గత సంవత్సరాల్లో మేము క్రమం తప్పకుండా స్కాలర్షిప్ ఫండ్స్‌ను పెంచుతున్నాము. సమాజంలోని అన్ని స్థాయిల విద్యార్థులకు విద్యా ఫలములను అందించినందుకు నేను రాష్ట్రీయ శిక్షణ సమితి ట్రస్టుకు మనఃపూర్వకముగా ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను. తరవాతి తరం లీడర్లను తయారు చేయడానికి, దేశ నిర్మాణం చేయడానికి ఈ స్కాలర్షిప్స్ మాకు సహాయం చేస్తాయి."

ప్రో ఛాన్సలర్, ఆర్వి విశ్వవిద్యాలయము, ఆర్ఎస్ఎస్టి, డా. (హెచ్.సి.) ఎ.వి.వస్. మూర్తి ఇలా అన్నారు, "సమాజంలోని ప్రతి స్థాయి విద్యార్థులకు విద్యను అందుబాటులో ఉంచాలన్నది, మా ట్రస్ట్ ఒప్పుకున్న లక్ష్యం. కేవలం మూడవ సంవత్సరములోనే ఆర్వియు కార్యకలాపాలలో, మేము స్కాలర్షిప్ ఫండ్స్‌ను 20 సార్లు పెంచాము. సాధ్యమైనంత ఎక్కువ మంది విద్యార్థులకు విద్యను అందించాలి అనే మా నిబద్ధతకు ఇది ఒక గొప్ప ప్రమాణం. అర్హత కలిగిన విద్యార్థులు ఈ స్కాలర్షిప్సుని ఉపయోగించుకుంటారని, వారి పూర్తి శక్తి సామర్ధ్యములను దేశము కొరకు వినియోగిస్తారని నేను ఆశిస్తున్నాను."

ప్రెసిడెంట్, ఆర్ఎస్ఎస్టి, డా. ఎం.పి. శ్యామ్ ఇలా అన్నారు, "అవసరంలో ఉన్న విద్యార్థులకు ప్రపంచ-స్థాయి విద్యను అందుబాటులోకి తేవాలన్న మా ట్రస్ట్ మిషన్ కి స్కాలర్షిప్స్ ఇవ్వడం అనే స్పూర్తి సరిపోతుంది. చదువు వైబ్రెంట్ ఇంటర్ డిసిప్లినరీ ఇకోసిస్టముని అందిస్తాము అని అర్వియు వాగ్దానం చేస్తుంది. స్కాలర్ షిప్‌లకు ఫండ్ అందించడానికి విశేషమైన కార్పస్‌ను సృష్టించడానికి మేము నిబద్ధతతో వున్నాము. ఆర్వి విశ్వవిద్యాలయము స్కాలర్షిప్ ఫండుకి సహాయం చెయ్యమని పరోపకారులను, సమాజం పట్ల ప్రేమ కలిగిన వ్యక్తులను నేను ప్రార్ధిస్తున్నాను."

ఎవరు ముందు వస్తే-వారికి స్కాలర్షిప్స్ ఇవ్వబడతాయి(ఫస్ట్ కమ్-ఫస్ట్ సర్వ్డ్ బేసిస్). మొదటి సంవత్సరంలో చూపిన విశిష్టమైన ప్రదర్శన ఆధారంగా స్కాలర్షిప్స్ రెన్యువల్ చెయ్యబడతాయి. అన్ని రాష్ట్రాలు, సెంట్రల్ బోర్డు, మంచి అకాడమిక్ ప్రదర్శన కలిగి గుర్తింపు పొందిన ఇతర భారతదేశపు ఇన్స్టిట్యూట్లకు ఈ స్కాలర్షిప్స్ ఓపెన్ గా వుంటాయి. ట్యూషన్ ఫీజు ఖర్చుని పూర్తిగా కానీ లేదా పాక్షికంగా కానీ ఈ అమౌంట్ కవర్ చేస్తుంది. విద్యార్ధులు https://admissions.rvu.edu.in/ వద్ద రిజిస్టర్ చేసుకుని, అడ్మిషన్స్ టీంని కాంటాక్ట్ చేయడం ద్వారా ఈ ప్రక్రియ అధిక వివరాలు తెలుసుకోవచ్చు.

అండర్-గ్రాడ్యుయేట్, పోస్ట్-గ్రాడ్యుయేట్, ఫుల్-టైమ్/పార్ట్-టైమ్ పిహెచ్.డి. ప్రోగ్రాములకు అడ్మిషన్లు ఇప్పటికే నడుస్తున్నాయి. ఈ స్కాలర్షిప్స్ ఆర్వి విశ్వవిద్యాలయం ఆరు స్కూళ్ళలో విస్తరించి వున్నాయి. స్కూల్ ఆఫ్ బిజినెస్, స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, స్కూల్ ఆఫ్ డిజైన్ అండ్ ఇన్నోవేషన్, స్కూల్ ఆఫ్ లిబరల్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్, స్కూల్ ఆఫ్ లా ద్వారా ఆర్వి విశ్వవిద్యాలయము 45+ డిగ్రీ ప్రోగ్రాములు అందిస్తోంది.


Next Story

Most Viewed