వాటి వల్ల ప్రభుత్వానికి రూ. 58 వేల కోట్ల నష్టం

by Disha Web Desk 17 |
వాటి వల్ల ప్రభుత్వానికి రూ. 58 వేల కోట్ల నష్టం
X

న్యూఢిల్లీ: దేశీయంగా ఐదు కీలక పరిశ్రమల్లో అక్రమ వ్యాపారం కారణంగా కేంద్ర ప్రభుత్వం రూ. 58 వేల కోట్ల పన్నుల ఆదాయాన్ని నష్టపోయినట్లు ఓ నివేదిక వెల్లడించింది. ఫిక్కి రూపొందించిన ఈ నివేదిక ప్రకారం, 2019-20 ఆర్థిక సంవత్సరంలో కీలక ఐదు పరిశ్రమల్లో ఆర్థిక వ్యవస్థకు నష్టం కలిగిస్తున్న స్మగ్లింగ్, నకిలీ కార్యకలాపాల వల్ల భారత ఖజానాకు రూ. 58,521 కోట్ల నష్టం ఏర్పడింది.

అంతేకాకుండా 16 లక్షల ఉద్యోగాలు పోయాయని నివేదిక తెలిపింది. ఇందులో ఎఫ్ఎంసీజీ, మొబైల్‌ ఫోన్, పొగాకు ఉత్పత్తులు, ఆల్కహాల్ వంటి ప్రధాన పరిశ్రమలున్నాయి. సమీక్షించిన ఆర్థిక సంవత్సరంలో ఈ పరిశ్రమల్లోని అక్రమ మార్కెట్ల పరిమాణం రూ. 2.60 లక్షల కోట్ల కంటే ఎక్కువని తేలింది.

ఈ ఐదు రంగాల్లో అక్రమ కార్యకలాపాల కారణంగా ప్రభుత్వానికి ఏర్పడిన పన్ను నష్టంలో ఎఫ్ఎంసీజీ ప్యాకేజ్‌డ్ ఫుడ్స్ రూ. 17,074 కోట్లు, ఆల్కహాల్ రూ. 15,262 కోట్లు, పొగాకు ఉత్పత్తులు రూ. 13,331 కోట్లు, ఎఫ్ఎంసీజీ గృహ, వ్యక్తిగత ఉత్పత్తులు రూ. 9,995 కోట్లు, మొబైల్‌ఫోన్ పరిశ్రమలో రూ. 2,859 కోట్ల వాటాను కలిగి ఉన్నాయి. ఇదే సమయంలో అక్రమ వ్యాపారాల వల్ల ఎఫ్ఎంసీజీ ప్యాకేజ్‌డ్ ఫుడ్స్ పరిశ్రమలో అత్యధికంగా 7.94 లక్షల ఉద్యోగాలు పోయాయి.

దీని తర్వాత పొగాకు పరిశ్రమ 3.7 లక్షల ఉద్యోగాలు, ఎఫ్ఎంసీజీ గృహ, వ్యక్తిగత ఉత్పత్తుల పరిశ్రమలో 2.98 లక్షలు, ఆల్కహాల్ పరిశ్రమలో 97 వేలు, మొబైల్‌ఫోన్ పరిశ్రమలో 35 వేల ఉద్యోగాలు పోయాయని నివేదిక వెల్లడించింది.


Next Story

Most Viewed