లాభాల నుంచి నష్టాల్లోకి జారిన స్టాక్ మార్కెట్లు

by Dishanational1 |
లాభాల నుంచి నష్టాల్లోకి జారిన స్టాక్ మార్కెట్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత ఈక్విటీ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్‌లో తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. ఉదయం ట్రేడింగ్ లాభాలతోనే ప్రారంభమైనప్పటికీ మిడ్-సెషన్ నుంచి సూచీలు నష్టాలకు మారాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సంకేతాలు ప్రతికూలంగా ఉండటం, ఆసియా మార్కెట్లు బలహీనపడటం, ఇటీవల ర్యాలీతో గరిష్ఠాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో మార్కెట్లు లాభాల నుంచి నష్టాలను మారాయి. ఇదే సమయంలో కీలక రిలయన్స్, భారతీ ఎయిర్‌టెల్ షేర్లలో పెద్ద ఎత్తున అమ్మకాలు ఒత్తిడిని పెంచాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 354.21 పాయింట్లు కోల్పోయి 71,731 వద్ద, నిఫ్టీ 82.10 పాయింట్లు నష్టపోయి 21,771 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఆటో, ఫార్మా, హెల్త్‌కేర్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టాటా మోటార్స్, సన్‌ఫార్మా, ఎంఅండ్ఎం, పవర్‌గ్రిడ్, టాటా స్టీల్, ఎన్‌టీపీసీ కంపెనీల షేర్లు లాభాలను దక్కించుకున్నాయి. బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్‌టెల్, బజాజ్ ఫిన్‌సర్వ్, మారుతీ సుజుకి, హెచ్‌సీఎల్ టెక్, ఆల్ట్రా సిమెంట్, టైటాన్, హిందూస్తాన్ యూనిలీవర్, రిలయన్స్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.05 వద్ద ఉంది. సోమవారం ర్యాలీలో ప్రభుత్వరంగ బీమా దిగ్గజం ఎల్‌ఐసీ షేర్లు కొత్త మైలురాయిని చేరుకున్నాయి. కంపెనీ షేరు మొదటిసారి రూ.1,000 మార్కును అందుకుంది. మార్కెట్లు ముగిసే సమయానికి 5.32 శాతం పెరిగి రూ.995.75 వద్ద ముగిసింది.



Next Story

Most Viewed